- అడ్డదారులు తొక్కుతున్న ఖాకీలు
- లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్న.. తీరు మార్చుకొని కొంతమంది అధికారులు
- తాజాగా రూ.50,000 లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన వెల్దండ ఎస్సై ఎం.రవి
రోజుకో అధికారి చేస్తున్న అవినీతి గుట్టురట్టవుతుంది.ఏసీబీ అధికారులు వేసిన వలలో చాపల చిక్కుకుంటున్నారు కొంతమంది అధికారులు. ఇక చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు అడ్డదారులు తొక్కుతున్నారు.ఎక్కడో చోట లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు.తాజాగా బుధవారం మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు అడ్డంగా పట్టుబడింది. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న ఎం.రవి రూ.50,000 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 102 అంబులెన్స్ డ్రైవరైనా జి.విక్రమ్ ఇంట్లో నుండి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఎస్సై ఎం.రవి రూ.50,000 వేల లంచం డిమాండ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు అధికారులు తెలిపారు.