Thursday, January 2, 2025
spot_img

ఠాణాలే వసూళ్ల అడ్డాలు

Must Read
  • దర్జాగా లంచాలు తీసుకుంటున్న పోలీసులు
  • నేల వ్యవధిలోనే ఇన్స్‌స్పెక్టర్‌, ఎస్‌ఐలు అనిశా వలలో
  • సీసీ కెమెరాల భయం లేకుండా బరితెగింపు….!!

రైలుబండి కదిలేది పచ్చా జండాకే… బతుకు బండి కదిలేది పచ్చనోట్లకే అన్న సీని గీతం రాష్ట్ర పోలీసులు శాఖకు సరిగ్గ అతుక్క పోతుంది. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు వస్త్తున్న ప్రతి 10 ఫిర్యాదుల్లో 3-6 వరకు పోలీసులపైనే ఉంటున్నాయని తాజగా ఆనిషా దాడుల్లో పట్టుబడుతున్న సంఘటనలు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. తప్పు చేస్తే కఠినంగా వ్యవహారించే డీజీపీ ఉండటంతో క్షేత్రస్ధాయి పోలీసు అధికారులు సిబ్బంది వణికి పోతున్నారు. ఏమాత్రం అదుపు తప్పి ప్రవర్తించినా అడ్డంగా శిక్షించే కమిషనర్లు బాస్‌లుగా ఉండటంతో పోలీసులు బుద్దిమంతులైపోయారు.. ఇవీ పోలీస్‌శాఖ గురించి తరుచూ వినిపించే వ్యాఖ్యాలు. రక్తం రుచి మరిగిన ‘పులి’ ఆ రుచిని మరిచి పోలేదన్నట్లు.. బల్ల కింద చేతులు పెట్టడంలో ఆరితేరిన కోందరు పోలీసులు అవకాశం దొరికితే చాలు వసూళ్లలో మునిగి తెలుతున్నారు. అలాంటి ఒకరిద్దరు ఘనులు అనిశా వలకు చిక్కుతుండగా లోలోపల మరెందరో అడ్డంగా దంచి కోడుతున్నారు. ఏకంగా ఠాణాలనే వసూళ్ల అడ్డాలుగా చేసుకుంటున్నారు.

కొన్ని రోజుల వ్యవధిలోనే ఠాణాల వద్ద ఎస్‌ఐలు, ఇన్‌స్పెక్లర్లు లంచాలు తీసుకుంటూ అనిశాకు వలకు అడ్డంగా దోరికిపోయారు. గతంలో ఠాణాల నిర్వహాణకు భారీగా వ్యయం వెచ్చించాల్సి రావడంతో వీధిలేని పరిస్థితిలో పోలీసులు వసూళ్లకు పాల్పడేవారు. కొన్ని ఠాణాల్లో నేల వారి మామూళ్ల వసూళ్ల కోసం రోడ్‌మాస్టార్లు, కలేక్టర్లు ఉండేవారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఒక్కోక్క ఠాణాకు రూ.75 వేల నిర్వహాణ నిధుల్ని కేటాయిస్తుండటంతో క్రమేపి ఠాణాల వాతావరణంలో మార్పు వచ్చింది..

దర్జాగా లాంచాలు ఎంతైనా సరే..
గ్రేటర్ తో పాటు నగర శివారు ప్రాంతాల పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పలు పోలీస్‌ స్టేషన్‌లో కిందిస్థాయి సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శిస్తునే ఉన్నారు. మీకేమి మేము తగ్గనట్లు ఇన్‌స్పేక్టర్లు తమ స్థాయికి అనుగుణంగా లంచాలు తీసుకుంటున్నారు. దీంతో ఠాణాల ఫిర్యాదు చేయడానికి రావాలంటేనే బాదితులు జంకుతున్నారు. కేసును బట్టి ఠాణా సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని బాదితులు వాపోతున్నారు. దీనికి చక్కటి నిదర్శనం సీసీఎస్‌ లో విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్ట‌ర్ చామకూరి సుధాకర్‌ నిందితుడి వద్దనుంచి రూ.3 లక్షలు తీసుకుంటుడగా అవినీతి నిరోధ‌క శాఖ అధికారులకు అడ్డంగా దోరికిపోయాడు. కేసు మాఫికి రూ.3లక్షలు తీసుకుంటూ కుషాయిగూడ ఠాణా ఇన్‌స్పెక్ట‌ర్ వీరస్వామి, ఎస్‌ఐ షేక్‌ షఫీ దళారి పరేంద్రతో కలిసి అనిషా వలకు చిక్కారు. అలాగే న్యాయ‌స్థానం నుంచి వచ్చిన ఎన్‌బీడబ్ల్యూ, జారీని బూచిగా చూపుతూ రూ.5 లక్షలు అడిగిన చైతన్యపురి కానిస్టేబుళ్ల ఇలా ఠాణాలే ఆడ్డాగా చేసుకుని పోలీసులు బరితెగిస్తుండటం ఉన్నతాధికారులనే విస్తుపోయేలా చేస్తోంది. కేసు నమెదులో నిర్లక్ష్యంగా వ్యవహారించారని బాదితుడి నేరుగా పోలీసు ఉన్నదాకారికి ఫిర్యాదు చేయడంతో వేంటనే స్పంధించిన రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ నాగోల్‌ ఠాణా ఎన్‌ఐ మధు, కొన్ని నెలల క్రితం బండ్లగూడ ఠాణా ఇన్స్‌సెక్టర్‌ షాకిర్‌ఆలీ.ఎస్‌ కేసు నమోదు విషయంలో నిర్లక్ష్యం వ్యవహారించడంతో నగర కోత్వాల్‌ శ్రీనివాస్‌ రెడ్డి వారిని విధుల నుంచి తప్పించారు.

సీసీ టీవి కెమెరాలు ఉన్నా..
ప్రజా మిత్ర పోలిసింగ్‌లో భాగంగా ప్రతి స్టేషన్‌లో ఫిర్యాదుదారులతో క్షేత్రస్ధాయి సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నారనే అంశంపై దృష్టి కేంద్రీకరించేందుకు ఉన్నతాధికారులు సీసీ టీవి కెమెరాలను అమ‌ర్చారు. కెమెరాల ఫీడ్‌ను ఠాణా ఎన్‌.హెచ్‌.వో. పర్యవేక్షణ కోసం ఆయన గదిలో తెరపై కనిపించే ఏర్పాట్లను చేశారు. తొలినాళ్ల‌ల్లో ఈ వ్యవమారం
ఉత్సహంగానే సాగినా తర్వాత నీరుగారి పోయిందని తాజా పరిణామాలను బట్టి వెల్లడవుతోంది. ఆసలు ఠాణాలో ఏం జరుగుతుందనే విషయం చాలామంది ఎస్‌.హెచ్‌.వో లకు తెలియడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పాతనగరంలో ని పరిస్థితి వేరు.. ఇక్కడ విధులు నిర్వహించే ఠాణా ఇన్‌స్పెక్ట‌ర్, సిబ్బంది తమకు తోచిన విధంగా విధులు నిర్వహిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.

ఇవీ అక్రమాలకు మార్గలు..
సాధారణంగా పోలీసులు లంచాల వసూలుకు ఏఏ అస్త్రాలు ప్రయోగిస్తున్నారంటే, నిందితులకు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించకుండా స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేయడం, ఎదైనా కేసులో దర్యాప్తు నిమిత్తం స్టేషన్‌కు తీసుకోస్తే కొట్టకుండా ఉండడం, ఎదైనా కేసులు నమోదు చేయాల్సిన తరుణంలో అలా చేయకుండా వదిలేయడం. బైక్ లేదా ఇతర వస్తువుల్ని పోగోట్టుకున్న బాధితుడు స్టేషన్‌ నుంచి దానిని తిరిగి తీసుకేళ్లేందుకు అవసరమైన చర్యల్ని వేగవంతం చేయడం. అభియోగ పత్రాన్ని అనుకూలంగా రూపోందించడం ప‌లు అంశాలను ఆస‌రా తీసుకొని బాధితుల నుండి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు.

Latest News

సంత‌లోకొస్తే.. క‌బేళాల‌కే..?

కొండమల్లేపల్లి సంతలోకి మూగజీవాలు అడుగు పెడితే గోవదకు సాగనంపడమే.. ఒకప్పుడు రైతుల కోసం సంత ప్రస్తుతానికి గోవద కోసం నడుస్తున్నా సంత సంత మాటున జరిగే అక్రమాలలో అందరు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS