Sunday, June 15, 2025
spot_img

తొలి గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వీరికే

Must Read

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డులను తొలిసారిగా ప్రకటించింది. రాష్ట్రంలో 14 ఏళ్ల గ్యాప్ అనంతరం మళ్లీ చలనచిత్ర పురస్కారాలను అందించబోతున్నారు. ఆ వివరాలను అవార్డుల జ్యూరీ ఛైర్‌పర్సన్‌ జయసుధ, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు వెల్లడించారు. 2024 ఏడాదికి గాను ఉత్తమ చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ ఎంపికైంది.

‘పుష్ప 2’ సినిమాలో యాక్షన్‌కి అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య వంటి ప్రముఖుల పేర్లతో ప్రత్యేక అవార్డులు ఇవ్వనున్నారు. ప్రజా గాయకుడు గద్దర్ స్మారకార్థం ఈ అవార్డులను ఆయన పేరిట ప్రదానం చేయనున్నారు. మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని జ్యూరీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారని జయసుధ తెలిపారు.

2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన మూవీలకు సంబంధించి ప్రతి ఏడాదీ ఒక ఉత్తమ చిత్రాన్ని సెలక్ట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సెన్సార్ పూర్తిచేసుకున్న ఫిల్మ్‌లను ఇతర కేటగిరీల కింద పరిగణనలోకి తీసుకున్నారు. 2024 సంవత్సరానికి సంబంధించి అన్ని విభాగాల్లోనూ అవార్డులను ప్రకటించారు. తెలుగు చిత్రాలతోపాటు ఉర్దూ సినిమాలకూ ప్రాధాన్యత ఇచ్చారు.

బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్స్‌తోపాటు మొత్తం 21 మందికి పర్సనల్, స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇవ్వనున్నారు. తెలుగు సినిమాకు సేవలందించిన లెజెండ్స్ గౌరవార్థం ఎన్టీఆర్, పైడి జయరాజ్, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య వంటి వారి పేర్లతోనూ ప్రత్యేక పురస్కారాలను ఏర్పాటుచేసినట్లు జయసుధ, దిల్ రాజు వివరించారు. అవార్డుల ప్రదానోత్సవ తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.

2024 సంవత్సరానికి గాను ఉత్తమ కేటగిరీలో ఎంపికైన చిత్రాలు, విజేతల వివరాలు..

తొలి ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
2వ ఉత్తమ చిత్రం: పొట్టేల్
3వ ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్
బెస్ట్ యాక్టర్: అల్లు అర్జున్ (పుష్ప 2)
బెస్ట్ యాక్ట్రెస్: నివేధా థామస్ (35 ఇది చిన్న కథ కాదు)
బెస్ట్ డైరెక్టర్: నాగ్ అశ్విన్ (కల్కి)
బెస్ట్ కో–యాక్టర్: ఎస్.జె.సూర్య (సరిపోదా శనివారం)
బెస్ట్ కో–యాక్ట్రెస్: శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: బీమ్స్ (రజాకార్)
బెస్ట్ సింగర్: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన–‘నిజమే నే చెబుతున్నా’ పాటకు)
బెస్ట్ లేడీ సింగర్: శ్రేయా ఘోషల్ (పుష్ప 2–‘సూసేకి అగ్గిరవ్వ కళ్లెత్తితే’ పాటకు)
బెస్ట్ కమెడియన్స్: సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా 2)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్స్: మాస్టర్ అరుణ్ దేవ్ (35 ఇది చిన్న కథ కాదు), బేబీ హారిక
బెస్ట్ స్టోరీ రైటర్: చంద్రబోస్ (రాజూ యాదవ్)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి).

Latest News

ఈ నెల 19న శుభాన్షు శుక్లా యాత్ర

తాజా తేదీని ప్రకటించిన ఇస్రో టెక్నికల్ ఇష్యూస్‌తో పలుమార్లు వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన తాజా తేదీని భారత అంతరిక్ష...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS