Monday, November 4, 2024
spot_img

పద్మశ్రీ గ్రహితలకు ప్రతి నేల 25 వేల పింఛన్,జీవో విడుదల

Must Read

పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి ప్రతి నెలా 25 వేల రూపాయలు పింఛనుకు సంబంధించి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జివో విడుదల చేశారు.ఇప్పటి నుండి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.కనుమరుగవుతున్న కళలను గుర్తించి,వాటిని భవిష్యత్తు తరాలకు అందించే క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సార‌ధ్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని ప‌ర్యాట‌క‌,సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు.అందులో భాగంగా ఇటీవ‌లే ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని అందుకున్న గ‌డ్డం స‌మ్మ‌య్య‌,దాస‌రి కొండ‌ప్ప‌ తదితరులకు ప్ర‌తీ నెల25 వేల రూపాయల ప్ర‌త్యేక‌ పింఛ‌న్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసినట్లు వివరించారు.ఇక నుంచి సాంస్కృతిక శాఖ ద్వారా పింఛ‌న్ డ‌బ్బులు నేరుగా వారి ఖాతాల్లో జ‌మ అవుతాయి.

Latest News

ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తారా

ప్రజాపాలన అంటే ప్రతిపక్షం గొంతు నొక్కడమా? శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులపై కేసులు దారుణం ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS