Saturday, September 6, 2025
spot_img

అమెరికాలోనూ ఉద్యోగుల కోత

Must Read
  • ట్రంప్‌ చర్యలతో స్వదేశంలోనూ వ్యతిరేకత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఇతర దేశాలపై టారిఫ్‌లు, ఆంక్షలతో విరుచుకుపడుతున్న ఆయన స్వదేశంలోనూ కొన్ని సంస్థల్లో సమూల ప్రక్షాళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచంలో అతిపెద్ద సహాయ సంస్థ అయిన అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలో ఏకంగా 9,700లకు పైగా ఉద్యోగాలు తొలగించేందుకు ట్రంప్‌ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 10వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. ఈ సంఖ్యను 300 దిగువకు తీసుకురావాలని చూస్తున్నారు. కేవలం 294 మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్‌ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీరిలో 12 మంది ఆఫ్రికా బ్యూరో, ఎనిమిది మంది ఆసియా బ్యూరోలో ఉండనున్నారట..! మిగతా 9700 మందికి త్వరలోనే ఉద్వాసన పలకనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే, దీనిపై అమెరికా విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సహాయ సంస్థను తీవ్రవాద ఉన్మాదులు నడుపుతున్నారని, వాళ్లందరినీ వెళ్లగొట్టేస్తానని ట్రంప్‌ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This