- అధికారులు రాజకీయ నాయకుల నిర్లక్ష్యం నిదర్శనం బాబు ఘాట్
మహాత్మా గాంధీ పుణ్యతి దినోత్సవ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి అనంతరం మహాత్మ గాంధీ ప్రార్థన చేసి, కార్యక్రమం ప్రారంభించారు. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర, వారు చేసిన త్యాగాలను భారతావని ఎప్పటికి మరవదని తెలంగాణ గాంధీ స్మారక నిధి అధ్యక్షులు జి.వి సుబ్బారావు అన్నారు. గాంధీ సంస్మరణ్ దిన్ సందర్బంగా హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్ వద్ద బాపూ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 1948న మహత్మ గాంధీ అస్థికలను ఫిబ్రవరి 12 తేదీన మూసీ నదిలో నిమజ్జనం చేసి, నది ఒడ్డున బాపూ సమాధి నిర్మించారని, కావున గాంధేయవాదులు ప్రతి సంవత్సరం ఈ రోజును గాంధీ సంస్మరణ్ దిన్‌గా పరిగణించి బాపూఘాట్ వద్ద పలు కార్యక్రమాలు నిర్వహించి వారికి నివాళులు ఆర్పిస్తారని ఆయన తెలియచేశారు. ప్రభుత్వం టూరిజం శాఖకు అప్ప చెప్పినా, దాన్ని పట్టించుకోవడం లేదని, ఈ పవిత్ర స్థలం ప్రస్తుతం అపరిశుభ్రతకు నిలయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చోరవ తీసుకొని ఈ ప్రదేశాన్ని ఒక చక్కని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మన దేశంలో రోజురోజుకు మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆచరించేవారు కనుమరుగవుతున్నారని, ప్రపంచ దేశాలు ఆయన సిద్ధాంతాలను కొనియాడు తున్నాయని కావున రాష్ట్ర ప్రభుత్వ మహాత్మా గాంధీ సిద్ధాంతాలను గ్రామాలలోకి తీసుకువెళ్లి యువకులలో నైతికత పెంపొందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి సంవత్సరం ‘‘ఇంటర్నేషనల్ సర్వోదయ డే’’గా పిలవడం జరుగుతుందని గాంధీయవాదులు, సర్వోదయ నాయకులు, పుర ప్రముఖులు భారీ ఎత్తున పాల్గొని ఆ మహనీయుని నివాళులర్పించే వారని సుబ్బారావు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని గాంధీయవాదులు, సర్వోదయ నాయకుల తరపున ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గాంధీ స్మారక నిధి కార్యదర్శి కోదాటి రంగారావు, బాపినీడు, సుబ్రహ్మణ్యం, జిల్లా విశ్రాంతి విద్యాశాఖ అధికారి బాపుబాట విజయ్ కుమార్, తెలంగాణ ఆంధ్ర మహిళా సభ ప్రొఫెసర్ పూర్ణచందర్రావు. ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక ప్రతినిధి జి.వి రామకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు మహాత్మా గాంధీ పాటలు ఆలపించారు.