- దేవాలయాలపై దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి
- విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి డా.మోహనకృష్ణ భార్గవ
జనగామ జిల్లా కేంద్రంలోని సిరిపురం కళ్లెం గ్రామ రహదారి మధ్యలో గల కట్టమైసమ్మ దేవాలయంపై గత శనివారం ఎవరో గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో ఎవరు లేనపుడు కోవెలని కూల్చివేసి, అమ్మవారి విగ్రహాన్ని సైతం పగలగొట్టే ప్రయత్నం చేసారు. అమ్మవారు రూపంతో పాటు ప్రాంగణం ధ్వంసం కాగా స్థానిక యువకులు సంఘటనను గుర్తించి సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని పంపించగా వెంటనే స్పందించిన విశ్వహిందూ పరిషత్ ఘటనా స్థలానికి చేరుకున్నారు జిల్లా కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ, ఉపాధ్యక్షులు బచ్చు బాలనారాయణ, సహ కార్యదర్శి మాస రాజులతో పాటుగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, హిందూ వాహిని, శివాజీ సేన సభ్యులు పాల్గొన్నారు. కళ్లెం గ్రామంలోని పలువురిని కలిసి విషయాన్ని సేకరించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ధ్వంసాన్ని చూసి చలించిపోయిన డాక్టర్ మోహనకృష్ణ భార్గవ హిందూ దేవాలయాలపై దాడికి పాల్పడిన చర్యను సహించేది లేదని, తక్షణమే పోలీస్ యంత్రాంగం దుండగులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేసారు, ఇకపై దేవాలయాలపై దాడులు జరిగితే హిందువుకు చూస్తూ ఊరుకోరని గ్రామ నడిబొడ్డున శిక్షిస్తారని ఖబడ్దార్ దుండగులారా అంటూ నినాదాలు చేసారు. అక్కడి నుండి సభ్యులందరూ సామూహికంగా వెళ్ళి లింఘాలఘణపురం పోలిస్ స్టేషన్ లో పిర్యాదు నమోదు చేసారు, వెంటనే దుండగులను పట్టుకొని శిక్షించాలని, ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం గ్రామస్తులను కలిసి త్వరలో గ్రామ హిందూ బైటక్ నిర్వహిస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో మహేష్, రాజు, విజయ్, దుర్గేష్, నగేష్, ఉమేష్, కృష్ణ, మణికంఠ తదితరులు పాల్గొన్నారు..
