Friday, May 9, 2025
spot_img

అహ్మదాబాద్‌లో వందకోట్ల విలువైన బంగారం పట్టివేత

Must Read

అహ్మదాబాద్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఏటీఎస్‌ పోలీసులు, డీఆర్‌ఐ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అహ్మదాబాద్‌లోని పాల్ది ప్రాంతంలో గల ఓ ఇంట్లో దాదాపు 100 కిలోలకుపైగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణాపై నిఘా పెట్టిన పోలీసులు.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. స్మగ్లింగ్‌ చేసిన పసిడిని పాల్ది ప్రాంతంలో గల అవిష్కార్‌ అపార్ట్‌మెంట్‌లో దాచిపెట్టినట్లు గుర్తించారు. ఈ మేరకు దాడి చేసి 107 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో 88 కేజీలు బంగారు కడ్డీలు, 19.66 కిలలో ఆభరణాలు ఉన్నాయి. పట్టుబడిన ఈ బంగారం విలువ మార్కెట్లో రూ.100 కోట్లకుపైమాటే అని అధికారుల అంచనా. బంగారంతోపాటు- రూ.2 కోట్ల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS