భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ZEE5 తాజాగా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’తో మళ్ళీ అందరినీ ఆకట్టుకుంది. ఓటీటీలోకి వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చూసి దూసుకుపోతోంది. ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఈ భారీ విజయం తరువాత ZEE5 సంస్థ మరో క్రేజీ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘భైరవం’ త్వరలోనే ZEE5లోకి రాబోతోందని ప్రకటించారు.
ప్రస్తుతం ZEE5లో ‘విరాటపాలెం’ సిరీస్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. కెవి శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌ను కృష్ణ పోలూరు డైరెక్ట్ చేశారు. అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రముఖ పాత్రలు పోషించారు. 1980లలో ఆంధ్రప్రదేశ్‌లోని విరాటపాలెం అనే గ్రామంలో ప్రతి వధువు తన పెళ్లి రోజున చనిపోతుంటుంది. అదొక శాపం అని గ్రామస్థులు భయంతో వణికిపోతుంటారు. అలా దాదాపు ఓ పదేళ్ల పాటుగా గ్రామంలో వివాహాం అనేది జరగదు.
భయం, మూఢనమ్మకాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండే ఆ ఊర్లోకి పోలీసు కానిస్టేబుల్ మీనా (అభిజ్ఞ వూతలూరు) వస్తుంది. శాపగ్రస్తమైన గ్రామంలోకి ప్రవేశించి అక్కడి ప్రజల్ని ప్రశ్నించడానికి ధైర్యం చేస్తుంది. ఆ ఊరి రహస్యాల్ని ఎలా తెలుసుకుంది? అది శాపమా? ఎవరైనా చేస్తున్న హత్యలా? అనే ఉత్కంఠ, థ్రిల్స్ కలిగించే అంశాలతో సిరీస్ సాగుతుంది.
జూన్ 26న ప్రీమియర్ అయిన విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్ ప్రశంసలు అందుకుంటోంది. ఒరిజినల్ కంటెంట్, నాణ్యమైన షోలను అందించే ZEE5 నిబద్ధతను చాటడంలో ఈ సిరీస్ ఓ ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ZEE5లో ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ స్ట్రీమింగ్ అవుతోంది. అందరూ తప్పక చూడండి.