Friday, May 16, 2025
spot_img

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Must Read

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మేడ్చల్ పట్టణంలోని క్లాసిక్ డాబా వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం బైక్‎ని ఢీ కొట్టింది. బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి కింద పడిపోవడంతో అతని తలపై నుండి వాహనం వెళ్ళింది. దీంతో అయిన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు సుచిత్రలోని బ్యాంక్ కాలనీకి చెందిన రవితేజగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS