Wednesday, September 17, 2025
spot_img

పోలీసు యూనిఫాం అంటే క్రమశిక్షణకు గుర్తు

Must Read
  • రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ.శ్రీధర్ బాబు

పోలీసు యూనిఫాం అంటే నమ్మకం, క్రమశిక్షణకు గుర్తని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ.శ్రీధర్ బాబు పేర్కొన్నారు. టీజీఎస్‌పీఎఫ్‌ సిబ్బంది పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ వద్ద ఉన్న శిక్షణ కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అయిన ముఖ్యఅతిథిగా హాజరై పోలీస్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అయిన మాట్లాడుతూ,శిక్షణార్థుల కోసం ఇది గర్వించదగిన ముఖ్యమైన రోజు అని తెలిపారు. పోలీస్‌ ఉద్యోగం అంటేనే క్రమశిక్షణకు మారుపేరు..విధులు నిర్వర్తించే సిబ్బంది, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది రాష్ట్ర అభివృద్దికి అవసరమైన ముఖ్యమైన సంస్థలను రక్షించే బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అంకితభావం, పట్టుదల సమష్టి కృషితో పోలీసుశాఖ పేరు ప్రఖ్యాతలను పెంపోందించాలని సూచించారు.

శిక్షణార్థుల సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉండాలని, వారు తమ పనులను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం అందించేందుకు పూర్తి సమర్పితంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది,భద్రత విషయంలో వారి కృషి అమోఘం అని అన్నారు. టీజీఎస్‌పీఎఫ్‌ 33సంవత్సరాల ఘనతను ప్రశంసిస్తూ, శిక్షణార్ధులు ఈ వారసత్వాన్ని కొనసాగించి తెలంగాణ భద్రత మరియు అభివృద్ధికి పెద్ద పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. శిక్షణార్ధులు నిజాయితితో, ధైర్యంతో సేవా చేయాలని తెలిపారు. రాష్ట్రంలోని ముఖ్యమైన సంస్థలు, అసెంబ్లీ, ఆర్.బి.ఐ, ప్రభుత్వ ఆసుపత్రులు, రక్షణరంగ సంస్థలు, సచివాలయంతో పాటు నాగార్జున సాగర్‌ డ్యాం వంటి కీలక సంస్థల భద్రతలో శిక్షణార్ధుల పాత్రను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ డాక్టర్‌ అనీల్‌కుమార్‌, ప్రిన్సిపాల్ శిక్షణ డీఐజి ఆర్‌. మాధవ్‌రావు, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిగుప్త ఐపీఎస్‌, ఐపీఎస్ సత్యానారయణ, సంగారెడ్టి జిల్లా ఎస్పీ రూపెష్‌తో పాటు ఇతర అధికారులు, శిక్షణార్థుల కుటుంబ సభ్యులు పాల్గోన్నారు. దాదాపు 265 మంది శిక్షణార్థులు ఉండాగా, వారిలో వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన సంజయ్‌, శివకుమార్‌, ఏం.శివా, మహ్మద్‌ ముజ్‌తబా, తదితరులకు మంత్రి చెతుల మీదుగా మోమెంట్‌ ప్రధానం చేశారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This