- కేజ్రీవాల్ అవినీతే కొంపముంచిందన్న హజారే
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నా హజారే(Anna Hazare) స్పందించారు. అధికార దాహంతోనే మాజీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్ హారే ఓడిపోయారని ధ్వజమెత్తారు. కేజీవ్రాల్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. లిక్కర్ స్కామ్‌తో కేజీవ్రాల్ అప్రతిష్ఠపాలయ్యారని, అందుకే ఆప్ ను ప్రజలు ఓడించారని దుయ్యబట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి దూసుకుపోతోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో బిజెపి మ్యాజిక్ ఫిగర్ 36 దాటింది. ప్రస్తుతం బిజెపి 48స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా అధికార పార్టీ ఆప్ 22 సీట్లలో ముందంజలో ఉంది. కేజ్రీవాల్‌తో పాటు సిఎం అతిషి విజయం సాధించారు. ఈ క్రమంలో సామాజిక కార్యకర్త అన్నా హజారే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి మంచి క్యారెక్టర్ ఉండాలని, మంచి ఆలోచనపరులనే ప్రజలు ఎన్నుకుంటారంటూ మాజీ సీఎం అరవింద్ కేజీవ్రాల్ పార్టీ ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పటినుంచో ఎన్నికల విషయంపై కేజీవ్రాల్ ను హెచ్చరించినా, వాటిని పెడచెవిన పెట్టారని.. దాని ఫలితమే ఇదన్నారు అన్నా హజారే. ఎన్నికల్లో పోటీ చేయడంపై పలుమార్లు హెచ్చరించాను. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థికి మంచి వ్యక్తిత్వంతో పాటు, మంచి ఆలోచనలు ఉండాలని నేను భావిస్తాను. వ్యక్తికి సంబంధించిన క్లీన్ ఇమేజ్ ఉండాలి. లేకపోతే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆప్ నేతలు అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని జైలుకు వెళ్లారు. ఇలాంటివి ఉండకూడదని చాలా కాలం నుంచి చెబుతున్నాను.