Friday, May 9, 2025
spot_img

పది పరీక్ష ఫలితాల్లోనూ బృంగి విద్యార్థుల ప్రభంజనం

Must Read

విద్యార్థులను అభినందించిన కార్యదర్శి ఏ.ప్రమీల చంద్రశేఖర్

తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఏసిఆర్ బృంగి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. విద్యార్థిని టీ హర్షిత రెడ్డి 578/600, ఏ.హర్ష ప్రియ 576/600, జి మణిదీప్ 575/600, ఎన్. సమీక్ష 573/600, పి.మిత్ర 572/600 మార్కులు సాధించగా 570 కి పైగా ఐదు మంది విద్యార్థులు, 560 కి పైగా 11 మంది, 550 కి పైగా 22 మంది విద్యార్థులు, 500 కి పైగా 60 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. మొత్తం గ్రేడ్ లో 92 మంది విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా స్కూల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో బృంగి విద్యాసంస్థల కార్యదర్శి ఏ. ప్రమీల చంద్రశేఖర్ విద్యార్థులను తల్లిదండ్రులను ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పాఠశాలను ప్రారంభించి 23 సంవత్సరాలు గడిచిందన్నారు. ప్రతి సంవత్సరం విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తూ పాఠశాలలో చదివిన విద్యార్థులు అనేక రంగాలలో డాక్టర్లు, ఇంజనీర్లుగా, ప్రభుత్వ ఉద్యోగాలలో, విదేశాలలో స్థిరపడ్డారని గుర్తు చేశారు. వికారాబాద్ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పాఠశాల నిర్వహణ కొనసాగుతుందన్నారు. అంతేగాక మారుతున్న విద్యానుసారం ఐఐటి ఫౌండేషన్ కూడా ఇస్తున్నామని గత సంవత్సరం నుండి నూతనంగా సీబీఎస్సీ పాఠశాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం కుమారస్వామి, రమాదేవి, శివప్రసాద్, మహేందర్, మహేష్, ప్రతాప్, వెంకట్, రహీమ, స్వర్ణలత, ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS