- విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి అల్వాల్ పోలీసులు ఇండియన్ కోడ్ సెక్షన్ 35(3) ప్రకారం శుక్రవారం నోటీసులు జారీ చేశారు. గతేడాది మార్చిలో జీహెచ్‌ఎంసీ అల్వాల్ సర్కిల్ కార్యాలయంలోకి విధుల నిర్వహణకు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి వెళ్తుండగా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అడ్డుకుని విధులకు ఆటంకం కలిగించారని డీసీ అల్వాల్ పోలీసులకు 6 మార్చి, 2024లో ఫిర్యాదు చేశారు. డిప్యూటీ కమిషనర్‌పై ఎమ్మెల్యే ఆయన అనుచరులు భౌతికదాడికి ప్రయత్నించడంతో పాటు అసభ్యంగా మాట్లాడారని, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆయన అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీసీ లిఖిత పూర్వకంగా పోలీసులను కోరారు. దీంతో దర్యాప్తు చేపట్టిన అల్వాల్ పోలీసులు ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరికి నోటీసులను పంపారు.