Sunday, June 15, 2025
spot_img

సోదరి పై బాలయ్య ఆత్మీయత…!

Must Read

ఓ వ్యక్తి జీవితంలో ఆనందకరమైన రోజు వస్తే.. ఆ సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పాటు తనకు కావాల్సిన వారితో పంచుకుంటూ ఉంటారు. అవధుల్లేని ఆనందాన్ని ముఖ్యంగా కుటుంబ సభ్యులతోనే షేర్ చేసుకుంటారు. దీనికి ఎవరూ అతీతులు కారు. సరిగ్గా సినీ నటుడు, హిందూపురం బాలకృష్ణ విషయంలో ఇదే జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యారు. ప్రమాణ స్వీకార వేదికపై చంద్రబాబు నాయుడు సతీమణి, బాకలృష్ణ సోదరి భువనేశ్వరి ఉన్నారు. ఆమెను చూసిన వెంటనే బాలకృష్ణ.. భువనేశ్వరి నుదుటిపై ముద్దు పెట్టి ఆత్మీయంగా పలకరించారు. భువనేశ్వరిని ఆ వేదికపై చూసి ఎమోషనల్ అయిన బాలకృష్ణ.. సోదరుడిగా నుదుటిపై ముద్దు పెట్టి తన సంతోషాన్ని పంచుకున్నారు. బాలకృష్ణకు సంబంధించిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Latest News

ఈ నెల 19న శుభాన్షు శుక్లా యాత్ర

తాజా తేదీని ప్రకటించిన ఇస్రో టెక్నికల్ ఇష్యూస్‌తో పలుమార్లు వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన తాజా తేదీని భారత అంతరిక్ష...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS