- ప్రచారంలో బిజెపి అభ్యర్థుల హవా
- కాంగ్రెస్ ఏడాది పాలన పై ప్రజల్లో అసంతృప్తి
- అభ్యర్థుల ఎంపిక లో ను కాంగ్రెస్ పార్టీ విఫలం
- ఇదే అదునుగా దూకుడుగా పెంచిన కమలం
- భవిష్యత్తులో గెలుపు కోసం ఈ ఎన్నికలు నిర్ణయాత్మకం
- ఓడిపోతామన్న భయంతోనే పోటీకి దూరంగా బిఆర్ఎస్
- బిజెపి సెంట్రల్ కోఆర్డినేటర్ ఢిల్లీ (తెలంగాణ) నూనె బాల్‌రాజ్
ఈ నెల 27న ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో జరగనున్న రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ మూడు సీట్లను కైవసం చేసుకుంటుందని కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బిజెపి అని బిజెపి సెంట్రల్ కోఆర్డినేటర్ ఢిల్లీ (తెలంగాణ) నూనె బాల్‌రాజ్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా.. కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయంగా నిరూపించుకోవాలని మా పార్టీకి ఉందని నిజానికి కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత ప్రజల (ముఖ్యంగా యూత్, ఉద్యోగుల) నాడి తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు చక్కని అవకాశంగా మారతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతటి కీలకమైన ఎన్నికల్లో ఓటమి భయంతో బీఆర్ఎస్ పోటీ నుంచి ముందే తప్పుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క గ్రాడ్యుయేట్ స్థానానికే పరిమితమైంది. దీంతో ఇదే అదనుగా కమలం నేతలు ప్రచారంలో జోష్ పెంచారు. మూడు చోట్ల అభ్యర్థులను నిలిపి, ప్రతి 20 మంది ఓటర్లకు ఒక ఇంచార్జిని పెట్టి జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇద్దరు కేంద్రమంత్రులు, ఎంపీలు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రచారంలోనే నిమగ్నమయ్యారని బిజెపి నాయకుడు నూనె బాల్‌రాజు పేర్కొన్నారు.
బీజేపీ జోరు బిఆర్ఎస్ బెజారు
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఏడాది క్రితం అధికారం కోల్పోయే వరకు గడిచిన 20 ఏండ్లలో ఎప్పుడు, ఏ ఎన్నిక వచ్చినా, అది జనరల్ ఎలక్షన్స్ అయినా, బై ఎలెక్షన్స్అయినా పోటీకి సై అంటూ సమరంలోకి దూకిన బీఆర్ఎస్.. ఇప్పుడు సైలెంట్ అయింది. ఎన్నికల్లో ఆ పార్టీ చతికిల పడిందనే చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకు పరిమితమైన బీఆర్ఎస్.. ఎన్నికలంటేనే వణుకుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటమిపాలైతే, ఆ ఎఫెక్ట్ లోకల్‌బాడీ ఎన్నికలపై ఎక్కడ పడ్తుందోననే భయంతో పోటీ నుంచి తప్పుకుంది. దీంతో ఆ ఖాళీని ఆక్రమించుకునేందుకు బీజేపీ రంగంలోకి దిగింది గత ఐదేండ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మినహా దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు బై ఎలక్షన్లలో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో ఆ పార్టీ పోరాడింది. సాగర్, మునుగోడు కోల్పోయినప్పటికీ.. దుబ్బాక, హుజూరాబాద్ లో విజయం సాధించింది. 2023లో జరిగిన అసెంబ్లీ, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేసిన బీజేపీ.. గతంతో పోలిస్తే మెరుగైన స్థానాలు గెలుచుకుంది. అసెంబ్లీలో ప్రాతినిధ్యాన్ని ఒక స్థానం నుంచి 8 స్థానాలకు పెంచుకున్న కమలం పార్టీ.. ఏకంగా 8 పార్లమెంట్‌స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. తాజాగా ఢిల్లీలో 26 ఏండ్ల తర్వాత విజయభేరీ మోగించడంతో తమ తర్వాతి లక్ష్యం తెలంగాణే అని ప్రకటించిన మా పార్టీ నేతలు.. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయమని చాటుకోవాలని భావిస్తున్నామన్నారు..
ఉపాధ్యాయ సంఘాల తో రాజీ పడేది లేదు
సాధారణంగా రాజకీయ పార్టీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపైనే దృష్టి పెట్టి, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఉపాధ్యాయ సంఘాలకే వదిలేస్తుంటాయి. మహా అయితే అభ్యర్థులకు పరోక్షంగా మద్దతిస్తుంటాయి. కానీ, ఈసారి మా బీజేపీ పార్టీ రూట్ మార్చింది. ఈ 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ సంఘాలతోను రాజీ పడేది లేదని పార్టీ భావించి రెండుచోట్లా తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో నిలిపింది. 2023 మార్చిలో జరిగిన హైదరాబాద్– రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ రెడ్డిని బరిలోకి దింపి, గెలిపించుకున్నది. తాజాగా కరీంనగర్– నిజామాబాద్– ఆదిలాబాద్– మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్యను, ఇదే స్థానం నుంచి గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అంజిరెడ్డిని, నల్గొండ– ఖమ్మం – వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తంరెడ్డిని పోటీలో నిలిపింది. ప్రస్తుతం టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీటీఎఫ్, ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులతో బీజేపీ పోటీ పడుతున్నది. తమకు మద్దతిచ్చే తపస్, ఇతర సంఘాలతో కలిసి ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రతి ఓటర్ ని కలుస్తాం సమిష్టిగా పోరాడుతాం
రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకున్నది. ప్రతి ఓటర్ ని కలుస్తామని ఎన్నికల్లో సమిష్టిగా పోరాటం చేసి గెలిచి చూపిస్తామని, ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కనీసం రెండుస్థానాల్లోనైనా విజయం సాధించాలనే పట్టుదలతో పార్టీ ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. అన్నీ తామై ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకూ ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. బూత్ లెవెల్, అసెంబ్లీ సెగ్మెంట్, జిల్లా, ఎమ్మెల్సీ నియోజకవర్గంగా ప్రత్యేకంగా కమిటీలు వేసి.. ప్రచారాన్ని ఉధృతం చేశారు. టీచర్ సెగ్మెంట్లలో ప్రతి 20 మంది ఓటర్లకు ఒకరిని ఇన్చార్జిగా, గ్రాడ్యుయేట్స్థానంలో వంద మందికి ఒకరిని ఇన్చార్జిగా నియమించారు. తెలంగాణ బీజేపీ ఇన్చార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ స్వయంగా జిల్లాలకు వెళ్లి ప్రచారం జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క ఆర్ఎస్ఎస్ సహా దాని అనుబంధ సంఘాలనూ ఆ పార్టీ ప్రచారంలోకి దింపింది. ఈ ఎన్నికల్లో చేసే ప్రచారం… త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకూ ఉపయోగపడుతుందనే భావనలో బీజేపీ ఉంది. దీంట్లో విజయం సాధిస్తే.. రానున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది.
కాంగ్రెస్‌కు కరీంనగర్ ఒక్కటే..?
మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్కేవలం ‘కరీంనగర్’ గ్రాడ్యుయేట్ స్థానానికి మాత్రమే అధికారంగా అభ్యర్థిని ప్రకటించింది. గతంలోనూ ఇదే సంప్రదాయం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మిత్రపక్షాలు పోటీ చేస్తే వారికి అధికారికంగానో, అనధికారికంగానో మద్దతిచ్చేవాళ్లమని చెప్తున్నారు. ఇలా రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను వదులుకున్న అధికార పార్టీ ‘కరీంనగర్ ’ గ్రాడ్యుయేట్ స్థానాన్ని మాత్రం కీలకంగా తీసుకున్నది. ఆ నియోజకవర్గం పరిధిలోనే బీజేపీకి నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండడంతో ఎలాగైనా దానిని గెలవడం ద్వారా తమ పట్టు నిరూపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ తరపున ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తుండగా.. ఈ నెల 24న స్వయంగా సీఎం రెండు ప్రచార సభల్లో పాల్గొననున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు స్వయంగా సీఎం ప్రచారంలో పాల్గొన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచేది మాత్రం బిజెపి అభ్యర్థులేనని బిజెపి సెంట్రల్ కోఆర్డినేటర్ బిజెపి సెంట్రల్ కోఆర్డినేటర్ ఢిల్లీ (తెలంగాణ) నూనె బాల్‌రాజ్ పేర్కొన్నారు.