Monday, June 16, 2025
spot_img

ఘ‌నంగా బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుకలు

Must Read

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ ‘అఖండ 2: తాండవం’ కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. వారి మునుపటి బ్లాక్ బస్టర్ అఖండకు ఈ సీక్వెల్ యాక్షన్, ఇంటెన్స్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ జార్జియాలో జరగనుంది. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను అక్కడ అద్భుతమైన ప్రదేశాల కోసం రెక్కీ చేస్తున్నారు, బాలకృష్ణ, ఇతర ప్రముఖ తారాగణం సభ్యులు పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జార్జియా సీనరిక్ బ్యూటీ నేపథ్యంలో ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ గా ఉంటాయి. జార్జియాలో జరుగుతున్న రెక్కీల మధ్య బోయపాటి శ్రీను తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇది సినిమా పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. హై బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌లో సంయుక్త ఫీమేల్ లీడ్ గా కనిపించనుంది. సంగీత సంచలనం ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు, సినిమాటోగ్రాఫర్ సి రాంప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ వంటి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. అఖండ 2 పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలోకి రానుంది

Latest News

ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యం చెప్పనున్న మహేశ్ కుమార్ గౌడ్

రేపు ఏసీపీ ఎదుట టీపీసీసీ చీఫ్ వాంగ్మూలం 2023 ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు పోలీసుల అభ్యర్థన మేరకు హాజరుకానున్న మహేశ్ గౌడ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS