Tuesday, September 16, 2025
spot_img

విన్నర్ ఎవరు.. రన్నరప్ ఎవరు

Must Read
  • పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ఘోరమైన ఫలితాలను చవిచూడబోతున్న బీఆర్ఎస్
  • ఊహించని రీతిలో పుంజుకోబోతున్న అధికార, బీజేపీ పార్టీలు
  • చావుతప్పి కన్నులొట్టబోయిన విధంగా పరువు కాపాడుకోనున్న ఎంఐఎం
  • ప్రముఖ మహా కాళీ ఉపాసకులు నాగభట్ల పవన్ కుమార్ శర్మ జోశ్యం

ప్రముఖ మహా కాళీ ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ గారు తెలంగాణా పార్లమెంట్ ఫలితాల గురించి చెబుతూ ఈసారి ఎవ్వరు ఊహించని విధంగా ఫలితాలు ఉండబోతున్నాయని, దాదాపు దశాబ్దానికి పైగా తెలంగాణా రాజకీయాలలో అప్రతిహతంగా తన ప్రభావాన్ని చూపుతూ తనదైన ముద్ర వేసుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటులో గెలవడం కూడా అసాధ్యమైన పరిస్థితి నెలకొంటుందని, అలాగే గతంలో 4 పార్లమెంటు స్థానాలను సాధించిన బీజేపీ పార్టీ ఈ సారి ప్రజల మన్ననలు పొందటం ద్వారా 8 సీట్ల వరకు అనగా జహీరాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల పార్లమెంటు స్థానాలలో విజయం సాదిస్తుందని, అలాగే ఈ మధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్యంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి గతంలో 3 పార్లమెంట్ సీట్లు రాగ రాబోయే పార్లమెంట్ ఫలితాలలో అత్యధికంగా 8 సీట్లు అనగా వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, భువన గిరి, నల్గొండ, ఖమ్మం పార్లమెంట్ స్థానాలలో విజయాన్ని పొందుతుందని, ఈ ఎన్నికల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఖ్యాతి అనూహ్యం గా పెరుగుతుందని, అయితే తూర్పు తెలంగాణాకు చెందిన కొందరు ముఖ్య నేతల వలన తలనొప్పులు వచ్చే అవకాశం ఉందని పవన్ కుమార్ శర్మ చెప్పారు.

ఇక ఎంఐఎం పార్టీ తరచుగా గెలుచుకునే హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఈసారి కూడా లుచుకోబోతున్నప్పట్టికి చివరి నిముషం వరకు వారికి ప్రత్యర్థి అయిన డాక్టర్ మాదవి లత ద్వారా ఉత్కంఠభరితమైన పరిస్థితులు తప్పవని, అలాగే ఈ పార్లమెంట్ ఫలితాల అనంతరం డాక్టర్ మాదవి లతని ఒక ముఖ్యమైన పదవి వరించబోతుందని ప్రముఖ మహా కాళీ ఉపాసకులైన పవన కుమార్ శర్మ జ్యోష్యం చెప్పారు.

పవన్ కుమార్ శర్మ చింతపల్లి మండలం, మాల్ గ్రామం నందు గత 15 సంవత్సరాలు గా మహా కాళీ ఉపాసకులుగా, దేవతా ప్రతిష్ట పండితులుగా, పౌరోహిత్యం చేస్తూ తనను సంప్రదించే వారికి దేవీ ఉపాసనా బలం చేత భవిష్యత్తుకి సంభందించిన జ్యోష్యం చెబుతూ ఎంతోమంది తమ సమస్యలనుండి బయట పడటానికి కారణం అయ్యారని ప్రతీతి. ఈమెయిల్ – pawankumarnaga555@gmail.com

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This