Friday, May 9, 2025
spot_img

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

Must Read

పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితం రెండ్రోజులు పట్టే అవకాశం

తెలుగు రాష్ట్రాల ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ను అధికారులు ఓపెన్‌ చేశారు. ముందుగా బ్యాలెట్‌ పేపర్లను కట్టలు కట్టనున్నారు. ఈ పక్రియ దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల వరకు జరగగా, అసలు కౌంటింగ్‌ పక్రియ ఆ తర్వాత మొదలు కానుందని అధికారులు చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రం లోగా వెల్లడి కానున్నాయి. అయితే పట్టుభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి మాత్రం 2, 3 రోజుల సమయం పట్టే అవకాశముంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో 2 గ్రాడ్యుయేట్‌, ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి.. తెలంగాణలో 2 టీచర్‌, ఒక గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 90 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఉదయం లెక్కింపు చేపట్టారు. చెల్లుబాటు అయిన ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం సహా ఉపాధ్యాయ నియోజకవర్గానికి కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో.. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్గొండలోని వేర్‌హౌసింగ్‌ గోదాములో కౌంటింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో.. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానిది ఏలూరులోని వట్లూరు సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గుంటూరు ఏసీ కాలేజీలో కొనసాగుతోంది.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS