Sunday, February 23, 2025
spot_img

అంబుజా సిమెంట్ పరిశ్రమకు అడ్డదారిలో అనుమతులు…?

Must Read
  • నెల రోజుల పాటు స్థానిక ప్రజల ధర్నాలు, నిరసనలు
  • వ్రాతపూర్వకంగా 200 కి పైగ ఫిర్యాదులు
  • అడ్డదారిలో దివీస్ కి ఇచ్చినట్లు అంబుజాకు అనుమతులివ్వవద్దు
  • కమిటీల ఏర్పాటు నివేదికల పేరుతో అనుమతులు ఇవ్వవద్దు.
  • అడ్డదారిలో అంబుజా కి అనుమతులు జారీ చేయడంలో కీలకంగా రాష్ట్ర కార్యాలయ అధికారి ప్రయత్నాలు
  • అంబుజా కు అనుమతులు ఇవ్వవద్దని మెంబెర్ సెక్రటరీ, ఛైర్మెన్ ఎస్ఈఐఎఎకు, ఛైర్మెన్ ఎస్ఈఎసి ల‌కు పర్యావరణ సామాజిక కార్యకర్త పి.ఎల్.ఎన్.రావు పిర్యాదు.
  • అంబుజా సిమెంట్ అనుమతుల జారీ పై హైకోర్టు ను ఆశ్రయించనున్న ప్రజా సంఘాలు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రామన్నపేట గ్రామం, మండల పరిధిలో అంబుజా సిమెంట్ పరిశ్రమ యజమాన్యం నూతనంగా స్టాండ్ లోన్ సిమెంట్ గ్రేడింగ్ యూనిట్, సిమెంట్ ఉత్పత్తులు చేపట్టడానికి తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ద్వారా జారీ చేసిన నోటిఫికేషన్ లో భాగంగా తేదీ:23-10-2024 న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వ‌హించారు.

నెల రోజులపాటు పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని స్థానిక ప్రజలు నిర‌స‌న‌లు:
అంబుజా సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుండి రామన్నపేట ప్రజలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు రాజకీయ పార్టీలు పూర్తిగా పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద యేత్తున ధర్నాలు నిరసనలు వ్యక్తం చేశారు. తేదీ:23-10-2024 న జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న ప్రజలు ప్రజాప్రతినిధులు అభిప్రాయాలను వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరు అంబుజా సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేయవద్దని పూర్తిగా వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం ప‌రిచారు.

200 కి పైగా వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు
అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రామన్నపేట సమీప మండలాలు గ్రామాల నుండి రామన్నపేట ప్రజల ప్రయోజనాలు దెబ్బతీయ వద్దని కోరుతూ పెద్ద ఎత్తున 200 పైగా వ్రాతపూర్వకంగా, ప్రజలు వినతి పత్రాలు సంబంధిత అధికారులకు అందజేయడం జరిగింది. పెద్ద ఎత్తున పరిశ్రమను ఎట్టి పరిస్థితులలోనూ ఏర్పాటు చేయవద్దని రాతపూర్వకంగా పర్యావరణ సామాజిక కార్యకర్త పి.ఎల్.ఎన్.రావు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అడ్డదారిలో దివిస్ ల్యాబ్స్ కు ఇచ్చినట్లు అంబుజాకు అనుమతులు ఇవ్వవద్దు :
దేశమంతా కరోనా సమస్యలతో లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో 2020లో కాలుష్య నియంత్రణ మండలికి 2018 లో దరఖాస్తు చేసుకున్న దివిస్ ల్యాబ్స్ కు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు యస్.ఇ.ఐ.ఏ.ఏ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి అడ్డదారిలో దివిస్ ల్యాబ్స్ పరిశ్రమకు నిబంధనలకు విరుద్ధంగా భారీ విస్తరణకు అనుమతులు జారీ చేసి చౌటుప్పల్,చిట్యాల, మునుగోడు, నారాయణపురం మండలాల ప్రజల ప్రయోజనాలు దెబ్బతీసారు.

అడ్డదారిలో అంబుజాకు అనుమతులు జారీ చేయడంలో కీలకంగా పిసిబి రాష్ట్ర కార్యాలయ అధికారి ప్రయత్నాలు :
దివిస్ ల్యాబ్స్ పరిశ్రమకు అడ్డదారిలో అనుమతులు జారీ చేసినట్లుగా పెద్ద ఎత్తున అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటును యాదాద్రి జిల్లా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అధికారి అంబుజా సిమెంట్ పరిశ్రమకు కన్సల్టెన్సీగా వ్యవహరించిన వారితో పిసిబి అధికారి కుమ్మక్కై అడ్డదారిలో అంబుజా సిమెంట్ కు అనుమతులు సి.ఎఫ్.ఇ జారీ చేసే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నట్లు సమాచారం ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి తెలంగాణలో అవినీతికి అక్రమాలకు అడ్డంగా మారిందని తెలంగాణ రాష్ట్రం కాలుష్య కాసారంగా మారిందని వందల సంఖ్యలో ఫిర్యాదులు పదుల సంఖ్యలో కోర్టు కేసులు నమోదైన దివిస్ ల్యాబ్స్ పై ఎటువంటి చర్యలు చేపట్టకుండా దివిస్ ల్యాబ్స్ పరిశ్రమ యజమాన్యంతో ఆర్థిక ప్రయోజనాల కోసం కుమ్మక్కై నివేదికలు దివీస్ పరిశ్రమకు అనుకూలంగా ఇస్తున్నారంటే కాలుష్య నియంత్రణ మండలి లో అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు దివీస్ ల్యాబ్స్ ఒక ఉదాహరణ.

కమిటీల ఏర్పాటు నివేదికల పేరుతో అంబుజా పరిశ్రమకు అనుమతులు ఇవ్వవద్దు :
కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర రాష్ట్ర కార్యాలయాలలో నూతనంగా ఏర్పాటు చేసే పరిశ్రమలను ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యతిరేకించిన సందర్భంలో కేంద్ర,రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా ఏకపక్షంగా అప్రజఇల్ కమిటీ పేరుతో ఏర్పాటు చేసి కొన్ని నిబంధనలు విధిస్తూ అడ్డదారిలో ప్రజలు వ్యతిరేకించిన పరిశ్రమల కు పర్యావరణ అనుమతులు జారీ చేసే అడ్డదారి ప్రక్రియ అదే దారిలో కాలుష్య నియంత్రణ మండలి లో రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ సియా కమిటీకి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అనుసంధానంగా పనిచేస్తున్న అధికారుల సహకారంతో అంబుజా సిమెంట్ పరిశ్రమకు పర్యావరణ అనుమతులు జారీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం ఉన్నందున దయచేసి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అంబుజా సిమెంట్ పరిశ్రమకు పర్యావరణ అనుమతులు జారీ చేయవద్దని పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఫిర్యాదు చేసినందున అనుమతులు జారీ చేయవద్దని ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని కోరుతున్నాను.నిబంధనలకు విరుద్ధంగా అంబుజా సిమెంట్ కి పర్యావరణ అనుమతులు జారీ చేసిన పక్షంలో పర్యావరణ పరిరక్షణ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అనుమతుల రద్దు కు న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని తెలియపరుస్తున్నాం.

Latest News

మల్క కొమరయ్య ని ఆశీర్వదించండి..

పిలుపునిచ్చిన నిజామాబాద్ ఎంపీ అరవింద్.. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించిన మున్నూరు కాపు సంఘం.. ఉపాధ్యాయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అరవింద్.. ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసిన బీఆర్ఎస్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS