Tuesday, July 1, 2025
spot_img

నిప్పులేనిదే పొగ రాదని మీకు తెల్వదా సారు..

Must Read

ఆజ్ కి బాత్

కేసీఆర్ సారు..మీరు తీసుకొచ్చిన గొర్ల పథకం
నిజంగా గొల్లకూర్మలను బాగుజెసేటందుకేన..?
జూన్ 20,2017న సిద్ధిపేట జిల్లా కొండపాకలో
మొదటిసారి గొర్రెలు పంచిర్రు..
మరి నవంబర్ 2023దాకా మీరే అధికారంలో
ఉన్నారు కదా..అరేండ్ల సంది ఎంతమంది గొల్లకూర్మ
అన్నలకు గోర్లు ఇచ్చిర్రు..ఎన్ని యూనిట్లు మంజూరీ
చేసి..లబ్ధిదారులకు ఇయ్యకుండా బిల్లులు దొబ్బీర్రు..
గిదంత మీకు ఎరుకలేకుంటేనే జరిగిందా..??
మీ జేబుల పైసలు పడలేద..??
నిప్పులేనిదే పొగ రాదని మీకు తెల్వదా సారు..
ఈ స్కీమ్ లో నీకింత..నాకింత అన్నట్టుగా
రూ.కోట్లు మింగి కుసున్నరంట
ఇయ్యల గొర్ల స్కాం బయటపడంగానే అధికారులను
బద్నాం జేసుడు న్యాయమేనా..?
దీంట్లో మీ హస్తం లేనిదే వాళ్ళు ప్రజల సొమ్ము తిన్నారా ..
అదే నిజమైతే..ఇన్నాళ్ళూ గొల్లకూర్మలను
మోసం జేసినోళ్లను జైల్లో ఎందుకు పెట్టలే
గుండెమీద సెయ్యి ఏసుకొని అలోసించుర్రీ సారు..

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS