- గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
- వ్యక్తి అరెస్ట్.. సుమారు రూ.10లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు స్వాధీనం
- వివరాలు వెల్లడిరచిన జిల్లా ఎస్పీ కే. నారాయణరెడ్డి ఐపిఎస్
రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాలు అమ్ము తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కే.నారాయణ రెడ్డి ఐపి ఎస్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడిం చారు. నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్, టాస్క్ ఫోర్స్ టీమ్, పెద్దేముల్ పోలీస్ అధికారులు పెద్దేముల్ వ్యవసాయాధికారి పి.పవన్ ప్రీతంలు పెద్దేముల్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఒక వ్యక్తి నాలుగు ప్లాస్టిక్ సంచులతో అనుమానాస్పదంగా కనిపించగా అతనితో పాటుగా ఉన్న సంచులను పరిశీలించగా వాటిలో ఎలాంటి లేబుల్స్ కాని, లాట్ నెంబర్ గాని, బ్యాచ్ నెంబర్స్ గాని , తయా రుచేసిన తేది గాని, గడువు తేది గాని ఎలాంటి సమా చారం లేకుండా పత్తి విత్తనాల ప్యాకెట్లు ఉన్నాయి. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా పత్తి విత్తనాలు ఉన్నాయి. విత్తనాలను వ్యవసాయాధికారి ప్రీతం పరిశీ లించి నకిలీ పత్తి విత్తనాలు అని తెలిపినారు. వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఉప్పలపాటి వసంత్ రావు కోనంకి గ్రామం, మర్టూర్ మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్టం చెందిన వ్యక్తి గత 15 సంవత్సరాల నుండి గాజుర్ కోట్ గ్రామం, గుర్మి ట్కల్ తాలూకా, యాద్గీర్ జిల్లా, కర్ణాటకలో నివాసం ఉంటున్నాడు. సంచులలోని నకిలీ పత్తి విత్తనాలను గుర్మిట్కల్ నుండి తీసుకొని వచ్చి రైతులకు అమ్మడానికి పెద్దేముల్ వచ్చినట్టు విచారణలో అంగీకరించాడు. పంటల కాలంలో అంటే జూన్ నెలలో ఈ నకిలీ పత్తి విత్తనాలు తెచ్చి అమ్మితే పోలీస్, వ్యవసాయ అధికారుల నిఘా ఎక్కువగా ఉంటుందని, అందుకే ప్రభుత్వ అధికా రులకు అనుమానం రాకుండా ఎక్కువ లాభాల గురించి ముందుగానే నకిలీ పత్తి విత్తనాలను తీసుకొని వచ్చి అమాయక రైతులకు ఎక్కువ ధరలకు అమ్ముతు మోస పూరితంగా లాభాలు ఆర్జిస్తాము అని నిజం కక్కాడు. మొత్తం 4 సంచులలో సుమారు రూ. 2,70,000 విలు వ కల్గిన , 150 కేజిల నకిలీ పత్తి విత్తనాలు పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం టాస్క్ ఫోర్స్ అధికారులు పెద్దేముల్ పోలీస్ అధికారులు నిందితుని ప్రస్తుత నివాసం అయిన గాజుర్ కోట్ గ్రామం, గుర్మిట్కల్ తాలూకా , యాద్గీర్ జిల్లా, కర్ణాటక రాష్టం వెళ్ళి సోదాలు నిర్వహించగా అక్కడ 7,20,000 లక్షల రూపాయల విలువ కల్గిన 4 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. అతని దగ్గర ఎలాంటి ప్రభుత్వ పత్రాలు కూడా లేకపోవ డంతో నకిలీ విత్తనాలు అమ్ముతున్న సంపత్ రావు పై పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం చేస్తుండ గా ఇతనిపైన గతంలో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. జిల్లా పరి ధిలో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాల న్నారు.రైతులు నకిలీ విత్తనాల బారీన పడకుండా ముందస్తు జాగ్రత చర్యలు తీసుకోవాలని, ఎవరైన వ్యాపారస్థులు, సంస్థలు, వ్యక్తులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందితే తక్షణమే స్థానిక పోలీసులకుగాని లేదా టాస్క్ ఫోర్స్ అధికారులకు గాని డైల్ 100కు గాని సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందనీ జిల్లా ఎస్పీ తెలిపారు.