Saturday, February 22, 2025
spot_img

ఒకే ఒక్కడు.. మాస్టారు

Must Read
  • తరగతులు ఐదు.. ఉపాధ్యాయులు ఒక్కరే
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్య మిథ్యే..
  • ఒకే తరగతిలో అందరికీ ప్రాథమిక విద్య బోధన
  • నాణ్యమైన విద్యను నష్టపోతున్న విద్యార్థులు

చిలిపిచేడ్‌ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో నాణ్యమైన ప్రాథమిక విద్యను పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన పసిపిల్లలు నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు మంచి క్రమశిక్షణ, విద్యాబోధన అందిస్తారని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిం చాలని బడి బాట, మన ఊరు మన బడి అంటూ అనేక ప్రచా రాలు చేయడం వరకే ప్రభుత్వాలు పనిగా పెట్టుకుంటున్నాయి.. తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన చిన్నారుల భవిష్యత్తును కాలరాస్తూ వారికి అందాల్సిన నాణ్యమైన ప్రాథమిక విద్యకు దూరం చేస్తూ ప్రభుత్వాలు విధ్యా శాఖ అధికారులు పబ్బం గడుపుకుంటున్నారు అనడానికి నిదర్శనమే చిలిపిచేడ్‌ మండలం చండూరు ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు కేవలం ఒకే ఒక్క ఉపాధ్యాయుడు పాఠాలు బోధించడమే. ప్రతి యేటా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సంఖ్య పెరుగుతున్నా తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడంతో బోధన కుంటుపడుతున్నది. ప్రధానంగా ఒకటి నుండి ఐదో తరగతి వరకు నడిచే ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారుతున్నదనే చెప్పాలి. మరోవైపు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు అన్న చందంగా.. పాఠశాలలో ఉన్న ఒక్కరూ, ఇద్దరు ఉపాధ్యాయులు ఎక్కువ రోజులు సెలవులో ఉండడంతో తరగతులు ఎన్ని ఉన్నా బోధించే ఉపాధ్యాయులు ఒక్కరే కావడం గమనార్హం. చిలిపిచేడ్‌ మండలంలోని చండూర్‌ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు మొత్తం 58 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సతీష్‌ అనే ఉపాద్యాయుడు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నాడు. అన్ని తరగతులకు అన్ని సబ్జెక్టుల పాఠాలు ఆయనే చెప్పాల్సి రావడం, విద్యార్థులు నోటు పుస్తకాల పరిశీలన, వివిధ రకాల రిపోర్టులు పంపించే పనులతో సతమతమవుతున్నాడు. ఒకే ఉపాద్యాయుడు ఉండడంతో విద్యార్థులు కూడా విద్యను నష్టపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ పాఠశాలకు మరో ఇద్దరు ఉపాధ్యా యులను కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఉపాధ్యాయుల కొరత తీర్చాలి – విద్యార్థులు తల్లిదండ్రులు
మా ఊరి పాఠశాలలో సుమారు 58 మంది విద్యార్థులు చదువుతుండగా ప్రస్తుతం ఒక్కరే ఉపాద్యాయుడు ఉన్నారు. దీంతో విద్యార్థులకు పాఠాలు అందకుండా పోతున్నాయి. మా పాఠశా లకు చెందిన మరో ఉపాధ్యాయుడు సుదీర్ఘ సెలవులో ఉండడం తో కొరత ఏర్పడింది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ఉపాధ్యాయుల కొరత తీర్చాలని కోరుతున్నాం..

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరిస్తాం -ఎంఈఓ పి.విఠల్‌
మండలంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్న విషయం నిజమే. మండలంలో మొత్తం 17 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనితో విద్యార్థులు నష్టపోతున్నారు. అలాగే ఉన్న ఉపాధ్యాయుడిపైనే భారం పడుతుంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తాను అని ఎంఈఓ పి.విఠల్‌ వివరణ ఇచ్చారు.

Latest News

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ బి.ఆనంద్‌ కుమార్‌ను అరెస్టు చేసిన ఎసిబి తన కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం పైలెట్‌ ప్రాజెక్టు సాంక్షన్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS