Friday, September 19, 2025
spot_img

మాజీ ప్రధాని మన్మోహన్‌ కన్నుమూత

Must Read
  • ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
  • ఆర్థికమంత్రిగా, ప్రధానిగా కీలక భూమిక
  • పలువురు ప్రముఖుల సంతాపం

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (92) కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గురువారం రాత్రి 9:15 నిమిషాలకు మన్మోహన్‌ చనిపోయినట్లు ప్రకటించారు. అంతకముందు మన్మోహన్‌ అస్వస్థతకు గురి కాగానే రాత్రి 8 గంటలకు ఎయిమ్స్‌కు తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్‌ సింగ్‌.. అక్టోబర్‌ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలంపాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు. మన్మోహన్‌ సింగ్‌ సెప్టెంబర్‌ 26, 1932లో అప్పటి అవిభక్త భారతదేశంలోని ప్రస్తుత పాకిస్తాన్‌ పంజాబ్‌ లోని గాప్‌ాలో జన్మించారు. ఆక్స్‌ఫర్‌ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో డాక్టరేట్‌ పొందారు. ప్లానింగ్‌ కమిషన్‌ చీఫ్‌గా, ఎకనామిక్‌ అడ్వైజర్‌గా భారత ప్రభుత్వంలో కీలక పదవుల్లో పనిచేశారు. 1991లో అప్పటి పీవీ నరసింహరావు ఆయనను తన మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా తీసుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన వ్యక్తిగా, సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా మన్మోసింగ్‌ ఘనత వహించారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో పదేళ్లపాటు భారత ప్రధానిగా పనిచేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. 33 సంవత్సరాల తర్వాత ఎగువ సభలో తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించారు. పీవీ.నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో జూన్‌ 1991లో ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాం నుంచి ఎగువ సభలో ఐదు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించారు. 2019లో రాజస్థాన్‌కు మారారు. పార్లమెంటులో పెద్ద నోట్ల రద్దును మన్మోహన్‌ సింగ్‌ వ్యతిరేకించారు. దీన్ని ‘వ్యవస్థీకృత దోపిడీ మరియు చట్టబద్ధమైన దోపిడీ‘గా మన్మోహన్‌ అభివర్ణించారు. మన్మోహన్‌ మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే,రాహుల్‌ గాంధీ, ప్రియాంక, రాబర్ట్‌ వాధ్రా, సిఎంరేవంత్‌ రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. ఆయన దేశానికి సేసిన సేవలను కొనియాడారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This