- పక్క సమాచారంతో ఎస్టీఎఫ్ పోలీసుల దాడులు
- హయాత్ నగర్ లో 5.070, దుల్ పేటలో 1.4 కేజీల గ*జాయి స్వాధీనం
- ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ లో భారీగా గ*జాయిను స్వాధీనం చేసుకున్నారు ఎస్టీఎఫ్ పోలీసులు. వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 5కేజీల గ*జాయిని స్వాధీనం చేసుకున్నారు. హయాత్ నగర్ ఓ ఇంట్లో గ*జాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో సీఐ శ్రీధర్, ఎస్సై జ్యోతి,హెడ్ కానిస్టేబుల్ లేఖ సింగ్, కానిస్టేబుళ్ళతో కలిసి తనిఖీలు నిర్వహించి 5.070 కేజీల గ*జాయిను స్వాధీనం చేసుకొని ఆర్.తిరుపతి, ఆర్.సాయి కిరణ్, సి గణేష్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దుల్ పేట లో ఇద్దరు మహిళలు గ*జాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించగా ఇద్దరు మహిళల నుండి 1.4 కేజీల గ*జాయిను స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేశారు.