- పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణలో అశ్రద్ధ వహిస్తున్న జిహెచ్‌ఎంసి అధికారులు…
- దుర్వాసనతో ముక్కు మూసుకుంటున్న ప్రజలు..
- లక్షల రూపాయల ప్రజాధనం వృధా చేసిన జిహెచ్‌ఎంసి…
- ఫోటోలకు ఫోజులిస్తున్న జిహెచ్‌ఎంసి అధికారులు…
మల్కాజిగిరి జిహెచ్‌ఎంసి అధికారుల తీరు చూస్తే పేరు పెద్ద ఊరు దిబ్బ అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది. గతంలో జిహెచ్‌ఎంసి ప్రజల సౌకర్యార్థం లక్షల రూపాయలతో మల్కాజిగిరి నియోజకవర్గం అన్ని డివిజన్ లలో పబ్లిక్ టాయిలెట్ల ను ఎటువంటి సరియైన నిర్వహణ లేక నామ్ కే వాస్తే ఏర్పాటు చేయడం జరిగింది. జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ లో చాలా మట్టుకు వాటికి నీటి సౌకర్యం లేకపోవడం పెద్ద మైనస్. లక్షల రూపాయల ప్రజాధనం వృధా చేశారని ప్రజలు వాపోతున్నారు. సఫిల్గుడా మినీ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన షీట్ టాయిలెట్, నేరేడ్ మెట్టు వాజ్పేయి నగర్ గేట్ వద్ద, సాయి నగర్ పెట్రోల్ బంక్ పక్కన ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ కూ నీటి సదుపాయం లేక కేవలం రేకు డబ్బుల్లా పబ్లిక్ టాయిలెట్స్ దర్శనమిస్తున్నాయి. డయాబెటిక్ పేషెంట్లు వాటినే మూత్రశాలలుగా వాడడంతో రోడ్డుపైన వెళుతున్న ప్రజలు పావు కిలోమీటర్ వరకు ముక్కు మూసుకోవ లసిన పరిస్థితి ఏర్పడిరది. ఎన్నోసార్లు పత్రికల్లో వీటిపైన శీర్షికలో ప్రచురితమైన, మల్కాజిగిరి జిహెచ్‌ఎంసి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నా రు. కేవలం స్వచ్ఛ సర్వేక్షన్, స్వచ్ఛ హైదరాబాద్ సమయంలో, సదరు మూత్రశాలలను శుభ్రం చేసి ముగ్గులతో అలంకరించి ఫోటోలకు ఫోజులు ఇవ్వ డమే తప్ప, లక్షలు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన మూత్రశాలలకు నీటి సదుపాయం ఏర్పాటు చేసి ప్రజలకు వాడకంలో తీద్దామని ఆలోచన అధికారు లకు లేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా జిహెచ్‌ఎంసి ఉన్నత అధికారులు, మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసిన మూత్ర శాలలను వాడకంలోకి తెచ్చే విధంగా జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశిం చాలని మల్కాజ్గిరి పుర ప్రజలు కోరుతున్నారు.