బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా నేడు ట్యాంక్‌బండ్ వద్ద బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్ చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, ఆర్ఎస్ ప్రవీణ్, డాక్టర్ సంజయ్‌తో పాటు ఇతర ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, పల్లారాజేశ్వర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సాయింత్రం హరీష్ రావు, పల్లారాజేశ్వర్ రెడ్డిలను విడుదల చేశారు. నాంపల్లి కోర్టు అర్ధరాత్రి పాడికౌశిక్కు బెయిల్ మంజూరు చేసింది.