Friday, September 19, 2025
spot_img

ఇంకెన్ని రోజులు ఈ అవస్థలు

Must Read
  • పట్టించుకొని పూర్తి చేయండి…
  • దారి వెంట నడవలేక చిన్నపిల్లల అగచాట్లు
  • అరచేతిలో ప్రాణాలతో కాలనీవాసుల ఇక్కట్లు

బాక్స్‌ డ్రైనేజ్‌ పనులంటూ మొదలుపెట్టి ఈరోజు వరకు పనులు పూర్తి చేయకపోవడంతో స్థానిక ప్రజలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల మాట పక్కన పెడితే తాము నడుచుకుంటూ కూడా పోవడానికి వీలు లేకుండా తమ వీధి అంతా తవ్వి నత్తనడకగా పనులు జరుగుతుండడంతో తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు, మూడు నెలలైనా పనులు నటనడకగా సాగుతున్నాయి అని న్యూ మిర్జాలగూడ కాలనీవాసులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలోని న్యూ మిర్జాలగూడ కాలనీలో జాతీయ సేవా సంఘం వీధిలో గత మూడు నెలల ముందు బాక్స్‌ డ్రైనేజ్‌ పనులంటూ మొదలుపెట్టి ఈరోజు వరకు పనులు పూర్తి చేయకపోవడంతో స్థానిక ప్రజలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల మాట పక్కన పెడితే తాము నడుచుకుంటూ కూడా పోవడానికి వీలు లేకుండా తమ వీధి అంతా తవ్వి నట్టనడకగా పనులు జరుగుతుండడంతో తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిన్నపిల్లలు ఆ దారి వెంట నడవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నడవాల్సిన పరిస్థితి ఏర్పడిరదని, కొద్ది రోజుల క్రితం స్థానిక వ్యక్తి కాళ్లు జారి గుంతలు పడిపోవడం జరిగిందని స్థానికంగా ఉన్న ఒక మహిళలు తెలిపారు. రెండు మూడు రోజులకు ఒకసారి వచ్చి పనిచేస్తుండటంతో పనులు నిదానంగా జరుగుతున్నాయని, పలుమార్లు పని త్వరగా పూర్తి చేయాలని కోరిన ఏం ప్రయోజనం లేకుండా పోయిందని, బాక్స్‌ డ్రైనేజ్‌తో మంచి జరుగు తుంద నుకుంటే, నెలలు తరబడి పనులు పూర్తి కాకపోవడం తమకు నరకంగా ఉందని, సంబంధించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు నత్తనడకగా సాగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయవల సిందిగా కాలనీవాసులు కోరుతున్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This