- సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం..
- బీసీ వాదం నడుస్తున్న తరుణంలో మృదు స్వభావి కొమరయ్య ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చిన బైరి శంకర్..
- ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మల్క కొమరయ్య..
బీసీ నినాదం దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తోంది ..ఈ తరుణంలో బీసీ బిడ్డ, పోరాటపటిమ, మృదు స్వభావి అయిన కొమరయ్య ను గెలిపించుకుంటే ఉపాద్యాయ సమస్యలు పరిష్కరించుకోవచ్చు అంటూ సర్వత్రా అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్ల ప్రచారంలో భాగంగా బిజెపి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య బిజెపి సిద్దిపేట జిల్లా శాఖ నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరిగింది.. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా సంఘం బాధ్యులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు
ఈ సందర్భంగా మల్క కొమరయ్య మాట్లాడుతూ.. బిజెపి అభ్యర్థిగా, ఒక బీసీ బిడ్డగా ఈసారి ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఖచ్చితంగా టీచర్ల సమస్యల పరిష్కారానికి ముందుంటానని.. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు ఎవరు కూడా టీచర్ల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఆయన ఆరోపించారు.. డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కునే అభ్యర్థులు కూడా నన్ను విమర్శిస్తారా..? గత 40 ఏళ్లుగా విద్యావ్యవస్థలో నేను ఉన్నాను.. నాకు టీచర్ల సమస్యలు అన్నీ తెలుసు. మీలాగా గెలిచిన తర్వాత సొంత ప్రయోజనాల కోసం టీచర్ల సమస్యలను గాలికి వదిలేయనని.. గెలిచిన తర్వాత కచ్చితంగా టీచర్లకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తానని.. టీచర్లకు ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. గొప్ప గొప్ప టీచర్ల సంఘాలు మూవే అని చెప్పుకునే వీళ్లు టీచర్ల సమస్యలను పరిష్కరిస్తే ఇన్ని సమస్యలు ఇంకా ఎందుకు ఉంటాయని.. ఇప్పటికీ టీచర్లు సమస్యలతో పోరాడుతూనే ఎందుకు ఉంటారని.. ఇన్ని సమస్యల మధ్యల పిల్లలకు పాఠాలు ఎలా చెప్తారని ఆయన సంఘాలను ప్రశ్నించారు .. ఇప్పటికైనా ఉపాధ్యాయులు ఇవన్నీ గ్రహించి తనను గెలిపిస్తే గతంలో మాదిరిగా కాకుండా కచ్చితంగా సమస్యలు పరిష్కారానికి మీ వెంటే ఉంటానని మీకు హామీ ఇస్తున్నారని తెలిపారు…
సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఒక బీసీ బిడ్డగా నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు కేంద్ర, రాష్ట్ర బిజెపి అధినాయకత్వాలకు నా కృతజ్ఞతలు… ప్రస్తుతం బీసీ వాదం నడుస్తున్న నేపథ్యంలో ఒక మృదుస్వభావి, మంచి మనసున్న వ్యక్తి మన మల్క కొమరన్నకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయమని కచ్చితంగా బీసీ ఉపాధ్యాయులందరూ మల్క కొమరయ్య కి సపోర్ట్ చేస్తారని, ఒక బీసీలే కాకుండా సంఘాలు కులాలకు అతీతంగా బిజెపి అభ్యర్థికి మద్దతు ఇస్తారని.. ఎందుకంటే గతంలో టీచర్ల సమస్యలకు బిజెపి ముందుండి కొట్లాడిందని, అందుకే టీచర్లు అందరూ ఈసారి బిజెపి అభ్యర్థులను ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు..
కొమరయ్య ముమ్మర ప్రచారం :
ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడడంతో కరీంనగర్-మెదక్-నిజమాబాద్-ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పెద్దపల్లి పట్ణణంలోని గాయత్రి డిగ్రీ కాలేజీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంత జిల్లాలో ప్రచారం చేయడం సంతోషంగా ఉందన్నారు. చిన్నప్పుడు ఈ ప్రాంతంలోనే చదవుకున్నట్లు తెలిపారు. చిన్నప్పుడు చదువు చెప్పిన టీచర్ల వల్లే ఇవాళ గొప్పస్థాయిలో ఉన్నట్లు చెప్పారు. టీచర్ల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని.. తనన ఎమ్మెల్సీగా గెలిపిస్తే వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. గతంలో ఎమ్మెల్సీలుగా గెలిచినవారంతా టీచర్ల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. సిద్ధాంతాలు కలిగిన బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తాను పార్టీలు, జెండాలు మార్చే ప్రసక్తే లేదన్నారు. టీచర్లకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాడతానని హామీ ఇచ్చారు.
అనంతరం తపస్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి కావడం సంతోషంగా ఉందన్నారు. తన మూలాలు మర్చిపోకుండా పుట్టిన గడ్డ కోసం ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. గత 40ఏళ్లుగా విద్యారంగంలో ఉన్న కొమరయ్యకు టీచర్ల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని.. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన్ని గెలిపించాలని కోరారు.