Tuesday, September 16, 2025
spot_img

కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయి,దైర్యంగా ఉండండి

Must Read
  • సంచలన కామెంట్స్ చేసిన గులాబీ బస్
  • పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కేసీఆర్
  • కొందరు నేతలు పార్టీ మారితే,వచ్చే నష్టమేమీ లేదు
  • కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయి
  • కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయి,నెల సమయం కూడా పట్టదు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు,నాయకులతో కేసీఆర్ సమావేశం అయ్యారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ కొందరు నేతలు పార్టీ మారినంత మాత్రాన వచ్చిన నష్టమేమీలేదని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసలను ప్రజలే గుర్తిస్తారని అన్నారు.కొన్ని రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతాయని,దానికి నెల సమయం కూడా పట్టాదాని తెలిపారు.నాయకులు,దైర్యంగా ఉండాలని,ఎలాంటి ఇబ్బందులు ఉన్న నేరుగా తన వద్దకు రావాలని నాయకులకు భరోసా కల్పించారు.తాజాగా కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఇప్పటికే బీఆర్ఎస్ నుండి గెలిచిన 05 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు.తాజాగా మాజీ స్పీకర్,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోచారం శ్రీనివాస్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది.ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సైతం కాంగ్రెస్ పార్టీలో చెరిపోయారు.త్వరలో మరికొంత మంది ఎమ్మెల్యేలు,నాయకులు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చెరబోతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This