- చాంపియన్స్ నుంచి ఆతిథ్య జట్టు అవుట్
- విరాట్ అజేయ సెంచరీ
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరువికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సెంచరీతో అజేయంగా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అలరించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించిన టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. పాక్ విధించిన లక్ష్యాన్ని టీమిండియా 42.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఐసీసీ టోర్నీలో మరోసారి పాక్‌పై టీమిండియా ఎదురేలేదని నిరూపించింది. ఈ ఓటమితో పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపుగా వైదొలిగినట్లే.