- పర్యటక అభివృద్ధి పేరుతో పేదల కడుపు కొడుతున్న నాయకులు..
- పక్కనే ప్రభుత్వ స్థలం ఉన్నా… ప్రైవేట్ భూముల అద్దెకు తీసుకోవాలని సూచన..
- అడిగినంత ఇవ్వాల్సిందే అంటున్న భూ యజమానులు
- పంచాయతీ ఆదాయానికి భారీగా గండి..
- సింగూర్ ప్రాజెక్ట్ వ్యాపారుల పరిస్థితి దయనీయం
రాజకీయ నాయకుల సూచనలతో నిరుపేద వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింగూర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయడంతో పాటు ప్రాజెక్టు వద్ద ఉన్న చిరు వ్యాపార దుకాణాలను తొలగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు అక్కడున్న చిరు వ్యాపారులను వారం 15 రోజుల్లోగా ఖాళీ చేయాలంటూ వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని మంత్రి దామోదర్‌ను వ్యాపారులు కోరగా రోడ్డుకు పక్క నే ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించిన పట్టాదారులతో మాట్లాడి దుకాణాలు పెట్టి ఇచ్చేందుకు ఒప్పిస్తానంటే హామీ ఇచ్చారు. అసలు తిరకస్తూ ఇక్కడే ఉందని విషయాన్ని నిరుపేద వ్యాపారులు గుర్తించలేకపోయారు. కాలీ స్థలానికి అడ్వాన్స్‌గా 50వేల రూపాయలతో పాటు నెలకు అద్దె ఒక షాప్ కు 5000 చొప్పున చెల్లించాలంటూ భూమి యజమాని సూచించారు. చేసేది ఏమీ లేక జీవనోపాధి కోసం ఒప్పందం చేసుకొని లక్షలు ఖర్చు చేసి తమ వ్యాపారాలను కొనసాగించుకునేందుకు మట్టి, సెటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న పట్ట భూమి పక్కనే కుడివైపున బీరప్ప గుడి నుంచి సింగూర్ ప్రాజెక్టుకు ఎక్కే వరకు ఖాళీగా ఉన్న ఇరిగేషన్ భూమిలో వ్యాపారం నిర్వహించుకునేందుకు అవకాశం ఉన్న రాజకీయ నాయకుల జోక్యంతో ప్రభుత్వ భూములు కాకుండా ప్రైవేట్ భూముల్లో వ్యాపారాలను పెట్టడం వల్ల నీరు పేద వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. సింగూర్ గ్రామం నుంచి ప్రాజెక్టు వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేసిన రోడ్డుకు కుడి వైపున 300 మీటర్లు వరకు ఖాళీ స్థలం మిగులుతుంది. కానీ అటు వైపు వ్యాపారం నిర్వహించుకునేందుకు అధికారులు రాజకీయ నాయకులు సూచన చేయకపోవడంతో పంచాయతీ, ఇరిగేషన్ శాఖకు వచ్చే ఆదాయానికి గండిపడడంతో పాటు చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. రోడ్డు విస్తరణ చేసినప్పటికీ కుడివైపున మాత్రమే షాపులు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్థలాలు ఉన్న అధికారులు ఎందుకు అక్కడ పెట్టు కునేందుకు అవకాశం ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు. అధికార పార్టీకి చెందిన నాయకుల భూముల అక్కడ ఉండడం వల్లే చిరు వ్యాపారులను ఆ పట్ట భూమిలో షాప్ లో ఏర్పాటు చేసుకునేందుకు మాత్రమే ఒప్పందం చేసుకొని మాత్రమే అనుమతులు ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. అధికారులకు ప్రజాప్రతినిధులకు పేదల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ప్రాజెక్టుకు కుడివైపున ఉన్న ఖాళీ స్థలాల్లో షాప్ లు పెట్టుకునేదుకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.