సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి
ప్రపంచ మానవాళికి దోపిడి నుండి విముక్తి మార్గం కలిగించేది ఎర్రజెండా పోరాటాలె అని కార్మికులు, కర్షకులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. గురువారం మేడే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో అమె ఎర్రజెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమెరికా దేశంలోని చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసం పోరాడి అమరులైన కార్మికుల స్ఫూర్తితో దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ సామాన్య ప్రజలకు కూడా రక్షణ లేకుండా పరిపాలన కొనసాగిస్తున్న మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే విధంగా పోరాటాల్లోకి ప్రజలు విస్తృతంగా రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని కార్మిక సోదరులకు సిపిఎం పార్టీ తరఫున మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న ఏలూగురి గోవిందు వీరబోయిన రవి మద్దెల జ్యోతి నాయకులు మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.