Monday, February 24, 2025
spot_img

ఎమ్మెల్యే గారు స్థానిక సమస్యలపై స్పందించండి

Must Read
  • విజ్ఞప్తి చేసిన మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి..
  • ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేత..
  • కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని ఆవేదన..
  • ఆక్రమణలు, అక్రమ కట్టడాలతో జనజీవన అస్తవ్యస్తం అవుతోందని వెల్లడి..
  • ప్రజా ప్రతినిధిగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని వినతి..

స్థానిక సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరుతూ మాజీ అధ్యక్షులు చెరు కుపల్లి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం సమర్పించారు.. బడంగ్పేట్‌ కార్పొరేషన్‌ లో గత కొంత కాలంగా వివిధ డివిజన్‌ లలో ఓపెన్‌ స్థలాలు, పార్కు స్థలాలు, ఆక్రమణకు గురవుతున్నాయి. సాక్షాత్తు ప్రభుత్వ అధికారులే వాటికి అక్రమ పద్ధతిన ఇంటి అనుమతులు ఇస్తున్నారు. టి పి ఓ. మున్సిపల్‌ రికార్డుల ప్రకారం అట్టి స్థలాలను ఓపెన్‌ పార్కు స్థలాలుగా చూపుతోనే, మరో పక్క వాటికి ఇంటి నిర్మాణ అనుమతులు ఇస్తున్నారని ఆయన తన వినతి పత్రంలో పేర్కొన్నారు. 31వ డివిజన్‌ లో మున్సిపల్‌ కాలనీ లేఔట్‌ లో 5100 గజాలు, బాలాజీ నగర్‌ లేఔట్‌ లో 400 గజాలు, 30 వ డివిజన్‌ ఎంసిఆర్‌ కాలనీలో 2000 గజాలు, 23వ డివిజన్‌ మారుతి నగర్‌ లేఔట్‌ లో 2200 గజాలు, 19వ డివిజన్‌ లో గాయత్రి హిల్స్‌ లేఔట్‌ లో 400 గజాలు, 18వ డివిజన్‌ అయోధ్య కాలనీ లేఔట్‌ లో 1600 గజాలు.. మొత్తం దాదాపుగా 11,500 గజాల ఓపెన్‌ స్థలాలు, పార్కు స్థలాలను ఇటీవల కాలంలో కొందరు ఆక్రమించుకొని, అక్రమ పద్ధతిన ఇంటి నిర్మాణ అనుమతులు పొంది.. కట్టడాలు చేపడుతున్నారు. వీరందరూ సామాన్య అమాయక ప్రజలు కాదు. పెద్దపెద్ద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులని ఆయన పేర్కొన్నారు.. కోట్లు విలువ చేసే స్థలాలను కొందరు అధికారుల ప్రోత్సాహంతో కాజేస్తున్నారు.. ఇట్టి విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ప్రభుత్వ అధికా రులు తగిన విధంగా స్పందించుటలేరు. అలాగే కార్పొరేషన్‌ లో అభివృద్ధి పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.. ఎస్‌.ఎన్‌.డి.పి. నాలా పనులు, పెద్ద బాయి మల్లారెడ్డి ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఇరిగేషన్‌ నాలా ఆక్రమణకు గురైన కారణంగా, అక్రమ కట్టడాలు నిర్మించినందువల్ల ఎగువ ప్రాంతం నుండి మురికి నీళ్లు, వర్షపు నీళ్ళు దిగువ ప్రాంతానికి పోకుండా ఏడాదికాలంగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి.. కార్పొరేషన్‌ పరిధిలో వివిధ డివిజన్‌ లలో గత ప్రభుత్వాలు విధించిన వివిధ జోన్ల కారణంగా, ప్లాటు యజమానుదారులు ఇంటి నిర్మాణం చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. దొడ్డిదారిన అక్రమ పద్ధతిన స్థానిక నాయకులకు, అధికారులకు లంచాలు చెల్లించి ఇంటి నిర్మాణం చేసుకొని వాటికి డోర్‌ నంబర్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిరది. కాబట్టి ఆ జోన్లను ప్రభుత్వ అధికారుల చేత ఎత్తివేయాల్సిందిగా ఆయన ఎమ్మెల్యే కి విజ్ఞప్తి చేశారు..

గత ప్రభుత్వం ప్రతిపాదించిన రేడియల్‌ రోడ్‌ 26 నెంబర్‌.. మందమల్లమ్మ చౌరస్తా నుండి నాదర్గుల్‌ మీదుగా ఓఆర్‌ఆర్‌ వరకు 150 అడుగుల వైశాల్యంతో నిర్మించుట ప్రతిపాదించినారు. కానీ ఇటీవల కాలంలో ఎమ్మెల్యే ఆదేశానుసారం బడంగ్పేట్‌ కౌన్సిల్‌ 100 అడుగులకు కుధిస్తూ తీర్మానం చేసినారు. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ నిర్మాణాలు మున్సిపల్‌ కార్యాల యం, జిల్లా గ్రంథాలయ భవనం, కార్పొరేషన్‌ క్రీడా ప్రాంగణం, ప్రజా మరుగుదొడ్లు 100 అడుగుల సెట్‌ బ్యాక్‌ తో నిర్మించారు. కానీ రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్లాట్‌ యజమానులు ఇంటి నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే, మున్సిపల్‌ అధికారులు, హెచ్‌ఎండిఏ అధికారులు 150 అడుగుల వరకు అనుమతి ఇస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు ఒక నిబంధన.. ప్రైవేటు భవనాలకు మరొక నిబంధన అంటూ స్థాని కంగా ఉన్న ప్లాట్‌ ఓనర్లు అక్రమ పద్ధతిన, పాత ప్రజాప్రతినిధుల, పాత అధి కారుల సంతకాలతో నిర్మాణ అనుమతులు పొంది, దొడ్డిదారిన నిర్మాణాలు చేపట్టి, డోర్‌ నంబర్లు పొంది ప్రభుత్వ ఖజానాకు లక్షల్లో, కోట్లల్లో గండి కొడుతున్నారు. మెయిన్‌ రోడ్డు 100 అడుగులా, 150 అడుగులా అన్నది స్పష్టత ఇవ్వగలరని ఆయన ఎమ్మెల్యేను అభ్యర్ధించారు. బడంగ్పేట్‌ కార్పొరేషన్‌లో ఇటీవల కాలంలో కార్పొరేషన్‌లో నిధులు లేకపోయినా.. గతకౌన్సిల్‌ కోట్లాదిరూపాయల పనులను ఏజెండాలో పొందుపరచి, కౌన్సిల్‌ అనుమతి పొంది.. అట్టి పను లకు టెక్నికల్‌ అనుమతులు రాకుండానే, టెండర్‌ ప్రక్రియ పూర్తి కాకుండానే.. ఇష్టారీతిన సంబంధిత కాంట్రా క్టర్లకు నామి నేషన్‌ పద్ధతిన పనులను అప్పగించారు.. సదర్‌ కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా.. నాసిరకం పనులు చేస్తు న్నారు. కొన్నిచోట్ల జరిగిన పనులకే మళ్లీ టెండర్లు పిలుస్తున్నారు. అత్య వసర సందర్భంలో తీసుకోవలసిన చిన్న చిన్న పనులకు సైతం లక్షల్లో, కోట్లల్లో బిల్లులు చూపిస్తూ ప్రభుత్వ ఖజానాను దుబారా గా ఖర్చు పెడుతున్నారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కార్పొరేషన్‌ పర్యటనకు వచ్చిన అనేక సందర్భాలలో గత ప్రభుత్వము ఇచ్చిన టువంటి ప్రత్యేక నిధులు 50 కోట్ల రూపా యలు ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసిందని పత్రికాముఖంగా తెలియ జేస్తున్నారు. ఈ ప్రభుత్వము ప్రత్యేక నిధులు విడుదల చేయని పక్షంలో కార్పొరేషన్‌ ప్రజలందరము చింతిస్తూ, అందుబాటులో ఉన్న నిధులతో అభివృద్ధి జరిగినా, కాస్త ఆలస్యమైనా పరవాలేదు. కానీ కార్పొరేషన్‌లో దాదాపు 40 కోట్ల పైన ఓపెన్‌ స్థలాలు పార్కు స్థలాలు అక్రమనకు గురైతే వాటిని మళ్లీ తిరిగి ఎలా పొం దుతామని ఆయన ఎమ్మెల్యేకు మనవి చేస్తూ ప్రశ్నించారు.. నిధు లు వచ్చినా రాకపోయినా కనీసం పార్కు స్థలాలనైనా కాపా డితే కోట్ల విలువైన ఆస్తిని కార్పొరేషన్‌ ప్రజలకు అందిం చిన వారవు తారని ఆయన పత్రికా ముఖంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డికి తమ వినతి పత్రం ద్వారా విన్నవించుకున్నారు. ఈ కార్య క్రమం లో బడంగ్పేట్‌ కార్పొరేషన్ 1, 2 అధ్యక్షులు రాళ్ల గూడెం రామ కృష్ణారెడ్డి, రామిడి వీరకర్ణరెడ్డి, తర్రి మల్లేష్‌యాదవ్‌ పాల్గొన్నారు..

Latest News

మల్క కొమరయ్య ని ఆశీర్వదించండి..

పిలుపునిచ్చిన నిజామాబాద్ ఎంపీ అరవింద్.. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించిన మున్నూరు కాపు సంఘం.. ఉపాధ్యాయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అరవింద్.. ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసిన బీఆర్ఎస్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS