Saturday, May 10, 2025
spot_img

ద‌ర్జ‌గా భూక‌బ్జా..

Must Read
  • 6 ఎకరాల ప్రభుత్వ భూమి క‌బ్జా చేసిన రోలింగ్ మిడోస్ ఆలె ఇన్‌ఫ్రా
  • కోట్ల విలువైన స‌ర్కార్ భూమిని కొల్లగొట్టిన నల్లారి నిరూప్ కుమార్ రెడ్డి
  • మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరుతో వైట్ కాలర్ మోసం..?
  • దర్జాగా మొత్తం 43 ఎకరాల్లో కట్టడాల ప్రసహనం..
  • అంతర్జాతీయ స్థాయికి తీసిపోని విలాసవంతమైన విల్లాలు ..
  • చిన్న జీయర్ స్వామి చేతుల‌మీదుగా ఆర్భాటంగా ప్రారంభం..
  • అవినీతి, అక్రమాలు, కబ్జాలపై ఫిర్యాదుచేస్తే పట్టించుకోని అధికార గణం..
  • చ‌ర్య‌లు తీసుకోవాలంటే భ‌య‌ప‌డిపోతున్న ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్..
  • 37 ఎకరాలకు హెచ్ఎండిఏ, రేరా అనుమతులతో గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం
  • గత కలెక్టర్ అమోయ్ కుమార్ డైరెక్షన్ లో కబ్జా చేశారా..?
  • నేటి కలెక్టర్ చర్యలు తీసుకుంటారా.. లేదా.. వేచి చూడాలి..

ఈయ‌న‌గారికి ఎలాంటి భయం, జంకు లేకుండా అడ్డగోలుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి అత్యంత అధునాతన విల్లాలు నిర్మిస్తున్నాడు.. శత్రు దుర్భేద్యంగా ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉందంటే ఇతగాడి పరపతి ఏస్థాయిలో ఉందో యిట్టే అర్ధం చేసుకోవచ్చు.. ఏ రాజకీయ నాయకుడు గానీ.. ఎంతటి అధికారి గానీ ఇతగాడిని టచ్ చేయాలంటే వణకి పోతున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు.. నిబంధనలకు వ్యతిరేకంగా విల్లాల నిర్మాణం యథేచ్ఛగా సాగిస్తున్నా.. ఈయనగారి దూకుడుకు కళ్లెం వేసే వారు ఎవరూ లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు సామాజిక వేత్తలు..

హైదరాబాద్ విశ్వనగరం.. అన్ని కాలమాన పరిస్థితుల్లో బ్యాలెన్సుడ్ గా ఉండే నగరం.. అంతే కాకుండా ఈ నగరం రోజురోజుకీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.. రూ. 2000 సంపాదించే వారి దగ్గరనుంచి, రూ. 2 లక్షలు సంపాదించే వారు సైతం ఈ నగరంలో జీవనం కొనసాగిస్తున్నారు.. అంతటి అనువైన నగరంగా హైదరాబాద్ పేరు ప్రఖ్యాతలు మూటగట్టుకుంది.. అయితే ఇక్కడ నివసించే వారిలో ప్రతి ఒక్కరికీ ఒక గూడు సంపాదించుకోవాలనే ఆశ ఉంటుంది.. దానికోసం రేయింబవళ్లు కష్టపడుతూ వుంటారు.. అయితే ఇలాంటి వారి కోరికను వారి బలహీనంగా భావించి వారిని తమకు అనుకూలంగా మార్చుకుని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు సామాన్య ప్రజానీకంతో బాటు సంపన్నులను కూడా టార్గెట్ చేస్తుంటాయి.. ఇక వారి అవసరాలకు అనుగుణంగా.. అత్యాధునిక హంగులతో, వసతులతో నిర్మాణాలు చేపట్టి.. వాటిని బిజినెస్ చేసుకుంటూ విక్రయిస్తూ ముందుకు సాగుతుంటాయి.. ఈ క్రమంలో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు అక్రమ ధనార్జనే ధ్యేయంగా ప్రజలను మోసం చేసే పన్నాగాలు పన్నుతుంటాయి.. హంగు ఆర్భాటాలతో.. ఓపెనింగ్ లు, ప్రీ లాంచింగ్ లు.. చినజీయర్ లాంటి సోకాల్డ్ సెలబ్రిటీలతో, సీఎంలతో కొనసాగించి.. సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో విస్తృత ప్రచారం చేసి.. ప్రజలను ఆకట్టుకుని బురిడీ కొట్టించి, మోసం చేసి ఆ తరువాత జండా ఎత్తేయడం అన్నది రివాజుగా మారిపోయింది..

ఈ కోవలోనే వచ్చి చేరింది రోలింగ్ మిడోస్ ఆల్ ఇన్‌ప్రా.. భాగ్యనగర ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు దగ్గరలో.. బెంగళూరు హైవే ఔటర్ రింగ్ రోడ్ అత్యంత సమీపంలో రోలింగ్ మిడోస్ ఆల్ ఇన్‌ఫ్రా గేటెడ్ కమ్యూనిటీ విల్లాలను నిర్మించింది.. ఈ కమ్యూనిటీలో అన్ని వసతులు కల్పిస్తూ వరల్డ్ లెవెల్ హంగులతో హెచ్ఎండిఏ, రేరా అనుమతులు పొంది గేటెడ్ కమ్యూనిటీని నిర్మించి.. ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి.. ఆ స్థలంలో అక్రమంగా ప్రవేశించి అడ్డగోలుగా నిర్మాణాలు సాగించింది.. కోట్ల రూపాయలకు అమ్మి కొన్ని వందల కోట్ల రూపాయలు వెనుకేసుకుని అమాయకుల జీవితాలతో దుర్మార్గంగా చెలగాటమారుతున్నారు.. ఇలాంటి వైట్ కాలర్ రియల్టర్ పై హైడ్రా రంగనాథ్, సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారో..? అర్ధం కావడం లేదు.. లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక అన్నది వాస్తవం.. ఒకసారి వివరాలు చూద్దాం..

హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హెచ్.ఎం.డీ.ఏ. చే ఆమోదించబడిన లేఅవుట్ ఇది.. హెచ్.ఎం.డీ.ఏ. పరిధిలోకి వచ్చే మహేశ్వరం మండలం, మంఖల్ గ్రామంలోని సర్వే నంబర్లు, 621, 622, 623, 624/1కి సంబంధించినది. లేఅవుట్ అభివృద్ధికి హెచ్.ఎం.డీ.ఏ. రిఫరెన్స్ నంబర్ 046889/ఎస్.ఎం.డీ./ఎల్.టి. /యూ6/11/2021 కింద ఆమోదం లభించిన మాట వాస్తవం..

సర్వేనెంబర్ 621, 622, 623, 624/1 ఈ సర్వే నంబర్లలో హెచ్ఎండిఏ, రేరా అనుమతులు తీసుకున్న లేఅవుట్ ఇది.. కానీ దారుణమైన విషయం ఏమిటంటే గేటెడ్ కమ్యూనిటీ పర్మిషన్ యొక్క విస్తీర్ణం 37 ఎకరాలు మాత్రమే.. కానీ వీరు విల్లాలు కట్టి.. చుట్టూ ప్రహరీ గోడ నిర్మించిన ప్రాంతం మొత్తం 43 ఎకరాల పైనే ఉంటుంది.. అయితే ఈ ప్రాంతాన్ని సందర్శించి క్షుణ్ణంగా పరిశీలిస్తే సర్వే నంబర్ 625లోని ప్రభుత్వ భూమి 6 ఎకరాలు కబ్జా చేసినట్లు సుస్పష్టంగా తెలిసిపోతుంది.. ఈ 6 ఎకరాలలో 20 అక్రమ విల్లాలు నిర్మించినట్లు కళ్ళముందు కనిపిస్తుంది.. వీరు ఒక్కో విల్లాను సుమారు మూడు కోట్ల రూపాయలకు అమ్ముతున్నట్లు కూడా ప్రచారం.. ఈ అక్రమ, అవినీతి దందాపై స్థానిక మహేశ్వరం ఎమ్మార్వోకు రాతపూర్వక ఫిర్యాదులు ఇస్తే.. వారు అటువైపు కన్నెత్తి కూడా చూడని దారుణ పరిస్థితి నెలకొన్నది.. ఇదే విషయంపై ఆదాబ్ టీం ఎమ్మార్వో ను ప్రశ్నిస్తే.. ఆయన ఇచ్చిన సమాధానం మతిపోయేలా చేసింది.. చాలా పేరుమోసిన పెద్ద మనుషులు ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మమ్మల్ని గేట్ లోపలికి ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించరు.. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి.. అని ఆయన ప్రాధేయపడుతున్న దీన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.. ఇదే విషయం స్థానిక తుక్కుగూడా మున్సిపాలిటీ కమిషనర్ కి తెలియపరిస్తే.. ఆయనకు సబ్జెక్టు మీద సరైన అవగాహన లేకపోవడంతో అంత బిగ్ షాట్స్ తో మేము పెట్టుకోలేము.. ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి చివరికి సీఎం వెళ్లాలన్నా, ఇంకా ఏ అధికారి వెళ్లాలన్నా ప్రోటోకాల్ పర్మిషన్ తీసుకోవాలి.. అంత స్థాయి మాకు లేదు.. మమ్మల్ని వదిలేయండి మహా ప్రభో.. అని ప్రాధేయ పడుతున్న దుష్టితి అక్కడ తాండవమాడుతోంది..

అసలు మనం ప్రజాస్వామ్య సమాజంలో ఉన్నామా..? లేక కొన్ని విదేశాల్లో కొనసాగుతున్న సైనిక పాలన లాంటి మోనోపాలీ వ్యవస్థలో ఉన్నామా..? అన్న ఆందోళన కలుగుతుంది.. మరీ సెన్సేషన్ విషయం ఏమిటంటే ఏకంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాకు చుట్టం అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటూ.. ప్రముఖ నామాల స్వామి వైష్ణవాచార ప్రముఖ ప్రచార పెద్ద అయిన చిన్న జీయర్ స్వామితో.. ప్రారంభ కార్యక్రమాలు కళ్ళు చెదిరే హంగు ఆర్భాటాలతో వీడియోలు.. సోషల్ మీడియాలో ప్రమోషన్లు.. ఈ వ్యవహారాలతో ప్రజలు ఎగబడి ఎగబడి ప్లాట్లు కొనడం.. ఇదీ నేడు జరుగుతున్న పరిస్థితి.. ఇక్కడ ప్రభుత్వ స్థలంలో విల్లాలు కొన్న వారి పరిస్థితి ఏంటి..? తీరా మోసపోతే రేపు ఎవరిని అడగాలి..? ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందనడానికి అక్షర సాక్ష్యం ఈ వార్తా కథనం..

కాగా, ఈ అవినీతి వ్యవహారంలో అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ ఐఏఎస్ హస్తం ఉంద‌నే అనుమానాలకు తావీస్తుంది.. మరి ఇప్పటి కలెక్టర్ అయినా నిజాయితీగా చర్యలు తీసుకుంటారా అన్నది అనుమానాస్పదంగా మారింది.. ఈ భారీ అవినీతిపై రేరా ఒక్కసారైనా దృష్టి సారించి.. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని.. స్థానిక గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి అవినీతికి పాల్పడుతున్న వారిని సీఎం రేవంత్ రెడ్డి, కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS