అనుమతులు లేకుండా అమ్మకాలు చేస్తున్న నెక్సస్ ఎలైట్ డెవలపర్స్
కోట్ల రూపాయలు కొల్లగొట్టిన మేనేజింగ్ డైరెక్టర్ బచ్చు కిషన్అనుమతులు లేకుండా సామాన్యులను మోసం చేస్తున్న ఎలైట్ డెవలపర్స్
ఈ అక్రమాల వెనుక ఉన్న అసలైన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు..?కిషన్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు చేస్తున్న అక్రమాలు
కుకునూర్‌పల్లి కేంద్రంగా సరికొత్త రియల్ దందాతక్కువ ధరకే ప్లాట్లు అంటూ కొనుగోలుదారులకు గాలం
మాముళ్ల మత్తులో జోగుతున్న సంబంధిత అధికారులు
అక్రమ లేఅవుట్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎటువంటి అనుమతులు లేకుండా ఇళ్ల స్థలాల లేఅవుట్‌లుగా మార్చేస్తున్నారు. మాకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయంటూ ప్రచారం చేస్తూ ప్లాట్‌ల అమ్మకాలు సాగిస్తున్నారు. సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలం కుకునూర్‌పల్లి గ్రామ కేంద్రంగా సరికొత్త రియల్ దందా కొనసాగుతోంది. అనుమతులు రాకముందే నిబంధనలకు విరుద్ధంగా ఫ్లాట్లను అమ్ముతున్నారు. తక్కువ ధరకు ప్లాట్ అంటూ కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని హబ్సిగూడ కేంద్రంగా నెక్సస్ ఎలైట్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ బచ్చు కిషన్ రియల్ దందాకు తెరలేపారు. బచ్చు కిషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా చలామణి అవుతూ మరికొందరితో కలిసి వినియోగదారులను మోసం చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు సమాచారం. నెక్సస్ ఎలైట్ డెవలపర్స్ సంస్థ అధికారులతో కుమ్మకై వెంచర్ డెవలప్‌మెంట్ పూర్తిచేయకుండా, ఎల్.పీ నెంబర్ అప్లై చేసుకోకుండా ప్లాట్లు మొత్తం అమ్మేసినట్లు తెలుస్తుంది.

సదరు సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా ఎడాపెడా అక్రమ లేఅవుట్‌లు చేసి ప్లాట్లను అమ్మినప్పటికి పంచాయతీ, రెవెన్యూ అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసినట్లు అసలే కనిపించడం లేదు. పత్రికల్లో కథనాలు వస్తే మాత్రం హడావుడి చేసే రెవెన్యూ సిబ్బంది మొక్కుబడిగా అక్కడకు వెళ్లి లేఅవుట్‌ను పరిశీలించి వచ్చేస్తున్నారు. అంతే తప్ప లేఅవుట్ వేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో మాత్రం మినమేశాలు లెక్కిస్తున్నారు. అంతేకాకుండా అక్రమార్కులు విధిల్చే ఎంగిలిమెతుకులకు ఆశపడి అధికారులు ఆటువైపు చూడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సరైన అనుమతులు లేకుండా సామాన్య ప్రజల జీవితాలతో అడుకుంటున్న ఇలాంటి వారి ఆట కట్టించాల్సిన రెవెన్యూ అధికారులు తమకేమి పట్టనట్టుగా వ్యవహరిండం పై ప్రజలు మండిపడుతున్నారు. కేవలం సంస్థ వారు ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి వందల సంఖ్యలో జనాలను ఇబ్బందుల పాలు చేయడం ఏంటని నిలదీస్తున్నారు. తమ పరిధిలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఉన్నతాధికారులు కూడా స్పందించకపోవడం పై మండిపడుతున్నారు.

ఇలా అక్రమంగా కోట్ల రూపాయలు దండుకుంటున్న మేనేజింగ్ డైరెక్టర్ బచ్చు కిషన్ వెనుక ఉన్న అసలైన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు..? అతనితో కలిసి తెర వెనుక పనిచేస్తున్న ఆ ముగ్గురు ఎవరు.. వారు చేసిన అక్రమాలపై మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది.. ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..