డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(స్ట్రాటజీ)గా రాజీవ్ ఘాయ్
పాకిస్థాన్‌పై ఇండియా విజయవంతంగా చేసిన తాజా యుద్ధం ‘ఆపరేషన్ సింధూర్’కి సారథ్యం వహించిన లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌కి కేంద్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (స్ట్రాటజీ)గా ఇవాళ (జూన్ 9 సోమవారం) నియమించింది. దీంతోపాటు డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్(DGMO)గా కూడా ఆయన కంటిన్యూ అవుతారు. డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(స్ట్రాటజీ) అనేది ఆర్మీ ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌లను పర్యవేక్షించేందుకు కొత్తగా ఏర్పాటుచేసిన విభాగం.
భారతీయ సైన్యంలోని అత్యంత ముఖ్య నియామకాల్లో ఇదీ ఒకటి కావటం విశేషం. ఆపరేషన్ సిందూర్‌లో ఇండియా పాకిస్థాన్‌లోని ప్రధాన వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. దీంతో ఆ దేశం భారత్‌ను శరణు కోరక తప్పలేదు. పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్(డీజీఎంవో).. కాల్పులను విరమించాలని మన దేశాన్ని కోరారు. ఈ మేరకు రాజీవ్ ఘాయ్‌తో చర్చించారు. ఫలితంగా మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణ పాటించాయి. ఆపరేషన్ సిందూర్‌ను సక్సెస్ చేసినందుకు రాజీవ్ ఘాయ్‌కి ఉత్తమ యుద్ధ సేవా పతకం కూడా లభించటం గమనార్హం.