Friday, May 9, 2025
spot_img

కష్టపడితేనే పనివిలువ తెలుస్తుంది

Must Read
  • ప్రతి ఒక్కరూ కష్టపడే అవకాశం ఉండాలి
  • యువత వ్యవసాయరంగంలో రాణించాలి
  • ఉపాధి హామీ పతకం మనకు గొప్పవరం
  • ఉపాధిశ్రామికులతో ఆత్మీయ సమావేశంలో పవన్‌

ఉపాధి హామీ పథకం దేశానికి, రాష్ట్రానికి ఒక వరమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. తమ ప్రభుత్వంలో శ్రామికులకు గుర్తింపు, గౌరవం ఉంటుందని అన్నారు. జగన్‌ ప్రభుత్వంలో పేదలు, శ్రామికుల కష్టాన్ని దోచుకుని దాచుకున్నారని ఆరోపించారు. మేడే సందర్భంగా గురువారం మంగళగిరిలో ఉపాధి శ్రామికులతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి ఉపాధి శ్రామికులు హాజరయ్యారు. వంద రోజులు ఉపాధి పనులు పూర్తి చేసిన వారిలో వివిధ జిల్లాల నుంచి పది మంది అధికారులను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఉపాధి శ్రామికులతో ఆత్మీయ సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కష్టపడడం నేర్చుకోవాలని, వ్యవసాయంలో యువత శిక్షణ పొందాలని అన్నారు. అలాగే ఉపాధిని వ్యవసాయానికి జోడించాల్సి ఉందన్నారు. ఉపాధి శ్రామికులు మాటలు వింటే ఆనందం కలిగించిందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధి పనుల ద్వారా పేదలకు ఆసరా కలుగుతుందని చెప్పారు. మొగల్తూరులో తమకు ఉన్న రెండు ఎకరాల పొలం అమ్మేసుకున్నామని గుర్తుచేశారు. తర్వాత ఎనిమిది ఎకరాలుకొని .. తాను వ్యవసాయం చేస్తున్నానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. శ్రమ, కష్టం విలువ తనకు తెలుసునని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

ఉపాధి కూలీ పదం తొలగించి ఉపాధి శ్రామికులంగానే పిలుస్తామని చెప్పారు. ప్రభుత్వం, అధికారులు, మీడియా కూడా ఈ శ్రామికులు పదం వాడాలని విజ్ఞప్తి చేశారు. ఇరవై ఏళ్ల వయసులో ఏం చేయాలో తనకు తెలిసేది కాదన్నారు. ఆ తర్వాత తనవంతుగా శ్రమ ఆయుధంగా ముందుకు సాగానని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందని తెలిపారు. శ్రామికులకు ఎంత మంచి చేయగలమో ఆలోచన చేస్తున్నామని అన్నారు. తమ మీద నమ్మకంతో ప్రజలు అధికారం అప్పగించారని తెలిపారు. మూగ జీవాల రోదన కూడా ఉండకూడదనేది తమ ఉద్దేశమని చెప్పారు. గజేంద్ర మోక్షం తరహాలో పంచాయతీ రాజ్‌ అధికారులు, సిబ్బంది మూగ జీవాల గొంతు తడుపుతున్నారని అన్నారు. తాము అదేశాలు ఇచ్చినా క్షేత్ర స్థాయిలో వారు పని చేస్తున్నందుకు అభినందిస్తున్నానని తెలిపారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత జగన్‌ ప్రభుత్వానిదని ఆరోపించారు. మద్యం నిషేధిస్తామన్న వారు మద్యాన్ని ఏరులై పారించారని విమర్శించారు.

పేదలు, శ్రామికులు కష్టాన్ని వైసీపీ ప్రభుత్వం దోచుకుని దాచుకుందని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలను గాడిలో పెట్టి పాలన సాగిస్తున్నామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. పల్లెల అభివృద్ధి దేశాభివృద్ధికి పట్టు గొమ్మలని ఉద్ఘాటించారు. అందుకే పల్లె పండుగ పేరుతో రూ.377.37 కోట్లతో గోకులాలను పూర్తి చేశామని తెలిపారు. ప్రతి రైతుకు అదనపు ఆదాయం కూడా లభిస్తుందన్నారు. 13,500 పశువుల తొట్టేల కోసం రూ. 60 కోట్లు ఖర్చు పెట్టామంటే అది శ్రామికుల కష్టం వల్లేనని చెప్పారు. నాలుగు వేల కిలోవిూటర్ల సీసీ రోడ్లు వేశామని అన్నారు. మరో నాలుగు వేల కిలోవిూటర్ల రోడ్లకు శ్రీకారం చుట్టామని చెప్పారు. డోలీ వెళ్లే ప్రాంతాల్లో రోడ్లు వేసి అంబులెన్స్‌లు వెళ్లేలా చేశామని అన్నారు. సీఎం చంద్రబాబు విజన్‌తో మోదీ సహకారంతో ముందుకు సాగుతున్నామన్నారు. మొగల్తూరులో ప్రధాని జీవన్‌ జ్యోతి గురించి తెలియదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఒక్కరోజే వారందరికీ వర్తించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎండ తీవ్రత వల్ల చాలా మంది ఇబ్బందులు పడతారని అన్నారు. కార్మికులకు 11 గంటల్లోపు పనులు పూర్తి చేసేలా చూడాలని అధికారులను పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. పనులు పెండింగ్‌లో ఉంటే సాయంత్రం నాలుగు గంటల తర్వాత పనులు పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి చోట నీడనిచ్చేలా చిన్న పాకలు ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి నీడ పట్టున ఉండేలా పని ప్రాంతాల్లో చూసుకోవాలన్నారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌లు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకం వేతనాలను సీఎం చంద్రబాబు పెంచారని గుర్తుచేశారు. శ్రామికులు ప్రమాద భీమా కోసం బ్యాంక్‌తో ఒప్పందం చేసుకున్నామని అన్నారు.

ప్రధాని మోదీ నిర్దేశకత్వర, చంద్రబాబు నాయకత్వంలో ఉపాధి హామీ శ్రామికులు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ పనులు త్వరలో పూర్తి చేస్తాం. మనిషికి విల్‌ పవర్‌ ఉండాలి. దార‌ద్య్రం పేరుతో ఎప్పుడూ పనులు ఆగకూడదు. పనిచేసే వాళ్లు ముందు ఉంటే దేశం త్వరగా అభివృద్ధి చెందుతుంది. నేను అయినా పని చేయడంలో ఎప్పుడూ ముందుంటా. పనిచేసే వారికి ముందు గౌరవం ఇవ్వాలి. మనకి కొన్ని జిల్లాల్లో చాలా దుర్భిక్షం ఉంది. రక్షిత నీరు ఇప్పుడు చాలా ప్రాధాన్యంగా మారింది. జలజీవన్‌ మిషన్‌ కింద రూ. 29 వేలకోట్లకు అనుమతి ఇచ్చారు. 2028 వరకు ఈ పనులు పూర్తి చేస్తాం. ఇంకా రూ.57 వేలకోట్లు మనకి అవసరం ఉంటుంది. కేంద్రం నిధులు లేకపోతే మన రాష్ట్రం నడపలేమా. నిన్న సమీక్షలో ఈ అంశాలపై ఉన్నత స్థాయిలో చర్చించాం. డిప్యూటీ సీఎం, ఇతర అధికారులు మానిటరింగ్‌ చేసేలా వార్‌ రూమ్‌ పెట్టాలని చెప్పాం. ఏపీలో పడే వర్షం వల్ల వచ్చే నీరు ఎలా సద్వినియోగం చేయాలనే దానిపై ఆలోచనలు చేయాలి. ఎన్నికల్లో గెలవడం కోసం వార్‌ రూమ్‌లు పెడుతున్నాం. కానీ మాకు ఓట్లకన్నా.. ప్రజల కష్టం తీర్చడమే ముఖ్యం. మంచి నీటి సమస్య తీర్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఫిల్టర్‌ బెడ్స్‌ చాలా దారుణంగా ఉన్నాయంటే… అది బాధ్యత రాహిత్యం 13,326 పంచాయతీల్లో వీటిపై దృష్టి పెట్టాలని చెప్పాం.

ఆర్వో ఫ్లాంట్‌తో నీటి వ్యాపారం చేస్తున్నారు. అందులో ప్రమాణాలు ఎవరూ పాటించడం లేదు. దీనిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి… మంచి నీరు అందించేలా చూడాలి. వాటర్‌ వార్‌ రూమ్స్‌ను జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేయాలి. నీటి పరిరక్షణపై ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రచారం చేయాలి. నీటి విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకోండి.. నీటిని వృథా చేయకండని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. ఉపాధి హామీ పథకంలో ఎంపిక చేసిన అధికారి శశిభూషణ్‌ మాట్లాడారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతోమందికి ప్రభుత్వం ఆసరా కల్పిస్తుందని తెలిపారు. మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకుంటూ ఉపాధి పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఏపీలో ఆదర్శవంతంగా ఉపాధి హామీ పథకం కొనసాగుతుందని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సూచనలతో ఈ పథకంలో చాలా మార్పులు చేశామని తెలిపారు. మొక్కుబడి పనులు కాకుండా ఫలితాలు కనిపించే పనులు చేపట్టామని చెప్పారు. ప్రణాళికాబద్దంగా పనులు పూర్తి చేయడం ద్వారా అభివృద్ధి కూడా ఆవిష్కృతమవుతుందని తెలిపారు. ఈ పథకం కింద దేశంలో దాదాపు రూ. 86 వేల కోట్లు ఖర్చు అయితే.. ఏపీలోనే రూ. 10వేల కోట్లు ఖర్చు అయ్యాయని అన్నారు. వచ్చే ఏడాది మరింత ఆదర్శంగా ఉండేలా ఏపీలో పనులు చేపట్టి, అభివృద్ధి చూపిస్తామని అధికారి శశిభూషణ్‌ వెల్లడించారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS