Friday, May 9, 2025
spot_img

సూర్య‌పేట జిల్లాలో పోలీస్ ల విసృత తనిఖీలు

Must Read
  • సోషల్ మీడియా లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దు
  • దేశ భద్రతకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యవహరించిన చర్యలు తప్పవు
  • శాంతిభద్రతల దృష్ట, సోషల్ మీడియాపై నిఘా
  • జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ గౌడ్

దేశ సరిహద్దుల వెంట ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో పోలీస్ శాఖ, పౌరుల రక్షణ, శాంతిభద్రత రక్షణలో ముందస్తు భద్రత చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ గౌడ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో జిల్లా సెక్యూరిటీ సిబ్బంది డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది బస్టాండ్ లు, జాతీయ రహదారి, ఫ్లై ఓవర్లు, వ్యాపార సముదాయాలు, ముఖ్యమైన కూడళ్ల వద్ద హై సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా సిబ్బందిని అందరినీ అప్రమత్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల దృష్ట్యా పోలీసులకు సెలవులు రద్దు చేసి, 24 గంటలు విధుల్లో ఉండేలా ఆదేశాలు చేశాం అన్నారు. ముఖ్య పట్టణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాం అన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పౌరులు దేశ భద్రతకు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు కూడా సోషల్ మీడియా నందు అనుచిత పోస్టింగులు కానీ అనుచిత వ్యాఖ్యలు కానీ పెట్టొద్దు అన్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని ఎస్పి కోరారు. సున్నితమైన పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని చట్టానికి లోబడి నడుచుకోవాలన్నారు. పౌరులను రెచ్చగొట్టేలా, మతాల మధ్య విద్వేషాలు కలిగేలా ఎవ్వరూ మాట్లాడవద్దని కోరారు. అనుమానితుల సమాచారం పోలీసు వారికి తెలియపరచాలన్నారు. సోషల్ మీడియా పై పోలీస్ శాఖ పూర్తి స్థాయి నిఘా ఉంచాలని పేర్కొన్నారు.

జిల్లా కేంద్రంలో సెక్యూరిటీ సిబ్బంది విస్తృత తనిఖీలు..
తనిఖీల్లో పాల్గొన్న డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసు. కొత్త బస్టాండ్, హైటెక్ బస్టాండ్ ప్రాంగణాలలో పోలీసులు విసృత తనిఖీలు నిర్వహించారు. బస్సులు నిలుపు ప్రాంగణాలను, దుకాణాలు బస్సులు, ప్రయాణికుల లగేజీ అనుమానిత వ్యక్తులను తనిఖీ చేశారు. పట్టణంలో మెరుగైన భద్రత కల్పించడం, డ్రగ్స్, గంజాయి లాంటి మాదకద్రవ్యాలు, నిషేధిత పదార్థాల అక్రమ రవాణా నిరోధించడం, కొత్త వ్యక్తుల కదలికలు గుర్తించడంలో భాగంగా జిల్లా కేంద్రంలో విస్తృతంగా ఈ తనిఖీలు నిర్వహించారు. గుర్తింపు నిర్ధారణ లేని వ్యక్తులకు, అనుమానితులు లాడ్జ్ ల నందు వసతి ఇవ్వవద్దని కోరారు. మాదకద్రవ్యాలు గుర్తించే డాగ్, పేలుడు పరదర్ధాలు గుర్తించే డాగ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేశారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS