Saturday, February 22, 2025
spot_img

కొండ పోచమ్మపై సాయి యాదవ్ మార్క్

Must Read
  • ఉత్సవాల నిర్వహణలో కీలక పాత్ర
  • వినూత్నంగా సంబరాలు
  • దేవాలయ అభివృద్ధిలో తనదైన ముద్ర
  • అంబరాన్ని అంటేలా ఉత్సవాల నిర్వహణ
  • సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు

తెలంగాణలో ప్రసిద్ధ గ్రామ దేవత పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ వరాల తల్లిగా పేరొంది.. జన నీరాజనాలు అందుకుంటున్న శ్రీ కొండ పోచమ్మ తల్లి దేవస్థానం నిత్యం దిన దినాభివృద్ధి చెందుతుంది. పచ్చటి పంట పొలాల‌ నడుమ ఎత్తైన కొండల మధ్యన ఆహ్లాదకరమైన వాతావరణంలో నిలువెత్తు దివ్యమైన రూపంతో భక్తులకు దర్శనమిస్తూ అభయహస్తంతో కొలువుదీరింది అమ్మవారు. ఈ దేవాలయ సందర్శన కోసం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల కూడా భక్తజనం పెద్ద ఎత్తున తరలివచ్చి పోచమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి ఏటా అమ్మవారికి జనవరి నెల మొదలుకొని ఉగాది వరకు వారాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వ‌హిస్తారు. దీనికి తోడు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. ఇంతటి ఘనమైన చరిత్ర, వైభవం కలిగిన ఈ దేవస్థానం అభివృద్ధికి హైదరాబాద్ ప్రాంతానికి చెందిన సాయి యాదవ్ తనదైన శైలిలో హితోదికంగా సహకరిస్తూ అమ్మవారి పట్ల తనకున్న భక్తి భావనను చాటుకుంటూ కొండపోచమ్మ దేవస్థానం అభివృద్ధిలో తన మార్క్ వేస్తున్నారు.

అమ్మవారి బ్రహ్మోత్సవాలు షురూ అయితే చాలు ఓ భక్తుడి పేరు దేవాలయం చుట్టుపక్కల మార్మోగిపోతుంది. ఆయన ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు వందల సంఖ్యలో ప్రజలు తరలి రావడం కామనే. చుట్టూ గ్రామాల్లో నుండి యువత, ప్రజలు సైతం ఆయన నిర్వహించే స్వచ్ఛంద కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం. సికింద్రాబాద్ అంబర్‌పేట ప్రాంతానికి చెందిన సాయి యాదవ్ గత కొన్ని యేళ్లుగా కొండపోచమ్మ దేవస్థానం అభివృద్ధికి ఆ విరాళంగా కృషి చేస్తున్నారు. దేవాలయం వద్ద నిర్వహించే పూజా కార్యక్రమాలతో పాటు బ్రహ్మోత్సవాలు నిర్వాహన లోనూ కీలక భూమికను పోషిస్తున్నారు. దేవాలయంలో జరిగే ఉత్సవాలకు విశేష ప్రాచుర్యం కల్పించడంతో పాటు తన సొంత డబ్బులు వెచ్చించి వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటారు. అలాగే బ్రహ్మోత్సవాల కార్యక్రమం కోసం పాల్గొనే దేవాలయానికి వచ్చే భక్తులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. కళాకారులు డప్పు చప్పులతో వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. అలాగే భక్టుల దాహాన్ని తీర్చేందుకు ఉచిత మంచినీటి సౌకర్యం కల్పిస్తారు.

అమ్మవారి సేవ పూర్వజన్మ సుకృతం – సాయి యాదవ్
అమ్మకు సేవ చేసుకునే భాగ్యం కలగడం తన పూర్వ జన్మ సుకృతం అని సాయి యాదవ్ అన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న నినాదాన్ని దృష్టిలో ఉంచుకొని తన సేవా కార్యక్రమాలకు శ్రీకారం చడుతున్నట్టు చెప్పారు. అమ్మవారీ చల్లని చూపులతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనట్లు సాయి యాదవ్ చెప్పారు.

Latest News

వికసిత్‌ భారత్‌కి అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు

సమ్మిళిత అభివృద్ధి.. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు కోట్లాదిమందికి ఊరటనీచ్చే విషయం ఆంధ్రప్రదేశ్‌ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS