Friday, May 9, 2025
spot_img

సౌదీ విదేశాంగ మంత్రి భారత్‌ రాక

Must Read

విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకొన్న వేళ.. సౌదీ అరేబియాకు చెందిన ఓ జూనియర్‌ మంత్రి హఠాత్తుగా న్యూఢిల్లీలో దిగారు. దేశ విదేశీ వ్యవహారాల శాఖ జూనియర్‌ మంత్రి అదెల్‌ అల్‌జుబైర్‌ నేడు దిల్లీకి వచ్చీ రావడంతోనే మన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌తో చర్చలు జరిపారు. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే చర్యల్లో భాగంగా ఈ పర్యటన చేపట్టినట్లు- తెలుస్తోంది. దీనిపై విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఎక్స్‌వేదికగా పోస్టు చేశారు. సౌదీ అరేబియా మంత్రి అదెన్‌ అల్‌ జుబైర్‌తో సమావేశం జరిగింది. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో భారత్‌ దృక్కోణాన్ని ఆయనకు వివరించానని జైశంకర్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌-పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా సౌదీ మంత్రితో భేటీ జరిగింది. ఆ తర్వాత ఇరాన్‌ విదేశాంగ మంత్రి సయ్యద్‌ అబ్బాస్‌ అరాగ్ఛితో మన విదేశాంగ మంత్రి భేటీ అయ్యారు. ఇప్పటికే భారత్‌-పాక్‌ల మధ్య రాజీ కుదిర్చేందుకు తాము సిద్ధమని ఇరాన్‌ వెల్లడించింది. ఇటీవల ఆయన సోషల్‌ విూడియాలో పోస్టు చేస్తూ.. సోదరుల్లాంటి పొరుగుదేశాలే మాకు అత్యున్నత ప్రాధాన్యం అని పేర్కొన్నారు. అంతేకాదు.. భారత్‌, పాక్‌లోని తమ దౌత్యకార్యాలయాల సహకారంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గిస్తామని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను కూడా అరాగ్ఛి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే సందర్శించారు. అక్కడి నాయకులతో చర్చించి.. తిరిగి ఇరాన్‌కు వెళ్లారు. ఆ తర్వాత న్యూదిల్లీకి వచ్చారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS