- కనుచూపు మేర కానరాని అభివృద్ధి.. పారిశుధ్యం అస్తవ్యస్తం
- రోడ్డు పై చెరువును తలపిస్తున్న మిషన్ భగీరథ వృధా నీరు
- కమిషనర్ సారు బిజీ బిజీ.. అధికారుల పర్యవేక్షణ కరువు..
శామీర్ పేట్ గ్రామాన్ని నూతన మున్సిపాలిటీ గా ఏర్పాటు చేయడంతో గ్రామంలో అన్ని మౌలిక వసతులతో పాటు అభివృద్ధి జరుగుతుందని ఆశ పడిన గ్రామస్తులకు ఆడిఆశే మిగిలింది. శామీర్ పేట్ గ్రామంగా ఉన్నప్పుడే కొద్దో గొప్పో గ్రామంలో సమస్యలు పరిష్కారం అవుతుండేవని కానీ ఇప్పుడు తుంకుంటలో మున్సిపాలిటీ లో విలీనం తరువాత పట్టించుకున్న నాధుడే కరువైయ్యారని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ సమస్యలే..
శామీర్ పేట్ లో పారిశుధ్య నిర్వహణ లోపించడంతో రోడ్డు పై ఎక్కడ చూసినా చెత్త చెదారమే దర్శనమిస్తున్నాయి. ఇక డ్రైనేజి విషయానికి వస్తే మురుగు నీరు పొంగి రోడ్డు పై ప్రవహిస్తూ కాలనిలోకి చేరుతోంది. ఈ మురుగు నీరు నిలవడంతో దోమల బెడద ఎక్కువై ప్రజలు రోగాల భారిన పడుతున్నారు. మిషన్ భగీరథ త్రాగు నీరు పైప్ లైన్ లీకేజీ అవ్వడంతో రోడ్డు పై వృధాగా పోతూ చెరువును తలపించేలా ప్రవహిస్తున్న అధికారులు కన్నెత్తి చూడడం లేదు.
కమిషన్ సారు బిజీబిజీ… రూటే సెపరేట్..
కమిషనర్ సారు శామీర్ పేట్ ను పట్టించుకోవడం లేదని సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఫిర్యాదు చేసిన అధికారి బిజీబిజీ ఉన్నానని సమాధానం చెప్పడం గమనార్హం.. ఇక్కడ విషయం ఏమిటంటే సార్ కి శామీర్ పేట్ వద్దు కానీ సెలెబ్రిటీ రిసార్ట్ లో మాత్రం సెటైల్మెంట్ లు చేసుకోవచ్చా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.. మరి కొందరు సారు రూటే సెపరేట్ అని కూడా వ్యంగంగా మాట్లాడుతున్నారు.ఊరంతా తిరిగిన అంటే వసూళ్లు ఏమి లేవని అర్ధమా లేక సమస్యలు లేవని అర్ధమా అని ప్రజలు ఆలోచిస్తున్నారు..