వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఆయన మూర్ఖుడిలా మాట్లాడారని మండిపడ్డారు. సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె అన్నమయ్య జిల్లా రాయచోటిలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్‌సీపీ చేసిన తప్పునే పదే పదే చేస్తోందని విమర్శించారు. సజ్జల కొడుకు భార్గవ్ రెడ్డి సామాజిక మాధ్యమాలను అడ్డంపెట్టుకొని తనపై కూడా దుష్ప్రచారం చేశాడని ఆరోపించారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెనని, ఒక లేడీనని కూడా చూడకుండా అవమానపరిచాడని, కించపరిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మహిళలందరినీ జగన్ తన అక్కాచెల్లెళ్లుగా చెబుతుంటారు గానీ ఆయన సొంత చెల్లికే మర్యాదలేదు అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.