Friday, July 4, 2025
spot_img

డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో కాల్పులు

Must Read

అమెరికాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది.ఏకంగా ఈసారి అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై 20 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు.త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ కూడా పోటీ చేస్తున్నారు.ఈ క్రమంలో డోనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.దుండగుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ చెవికి తీవ్ర గాయమైందని అధికారులు తెలిపారు.వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ట్రంప్ ను ఆసుప్రతికి తరలించారు.ఈ ఘటనకు పాల్పడిన తర్వాత కాల్పులు జరిపిన దుండగుడు మరణించాడని పోలీసులు తెలిపారు.20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరిపినట్టు భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS