Thursday, September 18, 2025
spot_img

బండరాళ్లు పడి తల్లీ కూతుళ్ల మృతి

Must Read
  • ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ దిగ్భ్రాంతి

ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండరాళ్లు పడి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన అక్కన్నపేట మండలంలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలోని గుట్ట వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న క్రమంలో బండరాళ్లు కూలి కందారపు సరోజన (50), తన కూతురు అన్నాజి మమత (35)లపై పడడంతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. ఐదుగురికి పలు గాయాలయ్యాయి. రోజువారీ గానే ఉపాధి హామీ పనులకు వెళ్లి పనులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కింద ఉన్న మట్టి కదిలి బండరాళ్లు మీద పడడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు పనిచేస్తున్న ఐదుగురు కూలీలకు గాయాలు కావడంతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ వాసాల సతీష్‌, సీఐ కొండ్ర శ్రీనివాస్‌, అక్కన్నపేట ఎస్త్స విజయభాస్కర్‌ ఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన ఇద్దరిని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న క్రమంలో పని ప్రదేశాన్ని ప్రమాద పరిస్థితుల్లో ఉందో లేదో అని గమనించకుండా ఫీల్‌ అసిస్టెంట్‌ వెంకటస్వామి పని చేయించడాన్ని స్థానికులు ఆయన పనితీరును తప్పు పట్టారు. ఉన్నతాధికారులు కూడా జరుగుతున్న పనిని పర్యవేక్షించకపోవడం వల్లనే ఈ ఘోర ప్రమాదానికి దారితీసిందని నాయకులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఉపాధి హామీ కూలీలు మరణించడం పట్ల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఘటనకు సంబంధించిన కారణాలపై జిల్లా కలెక్టర్‌ మను చౌదరితో మాట్లాడినట్టు వెల్ల‌డించారు.. ఉపాధి హామీలో ఇద్దరి మరణానికి కారణమైన ఘటనపై జిల్లా అధికారులతో విచారణకు ఆదేశించి తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. మరణించిన, గాయపడిన ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా కల్పించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay) ఘటనపై కలెక్టర్‌ మను చౌదరితో చరవాణిలో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతి చెందిన ఇద్దరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This