ఎన్నారై అరవింద్ వంగలతో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ రమణ
సమావేశం
హైదరాబాద్‌లో పెట్టుబడులకు గల అవకాశాలపై విస్తృతంగా చర్చలు
తెలంగాణాతోపాటు అమెరికా తదితర విదేశాల్లో అరవింద్ వంగల ట్రస్ట్ సేవా కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ రమణ.. అమెరికాలోని డల్లాస్ నగరంలో ఎన్ఆర్ఐ బిజినెస్‌మ్యాన్ అరవింద్ వంగలతో ఆయన నివాసంలో ఇటీవల సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు గల అవకాశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. చర్చలు సానుకూలంగా, ఫలప్రదంగా జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ యువత, పరిశ్రమలు, విదేశాలకు వలసపోయిన తెలంగాణ ప్రజలకు మరిన్ని అవకాశాలు అందించాలనే దిశగా చర్చలు జరిగాయి.

ఈ సందర్భంగా అరవింద్ వంగల మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలను విస్తరించడం ద్వారా తమ సంస్థలు స్థానిక పరిసరాలకు తగ్గట్లు, ఆర్థిక అభివృద్ధికి మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. అరవింద్ వంగల.. అమెరికా, మెక్సికో, కొలంబియా, ఇండియా, దుబాయ్ దేశాల్లో ఐటీ, ఇంజనీరింగ్ సర్వీసులు, రియల్ ఎస్టేట్ రంగాల్లో విజయవంతంగా వ్యాపారాలు చేస్తున్నారు. స్వరాష్ట్రం తెలంగాణాతోపాటు అమెరికా తదితర దేశాల్లో అరవింద్ వంగల ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తద్వారా మానవతను చాటుకుంటున్నారు. ఈ భేటీలో అరవింద్ వంగల, కుటుంబ సభ్యులు
రమ్య వంగల, వంశీకృష్ణ కొలగాని పాల్గొన్నారు.