Tuesday, September 16, 2025
spot_img

ఏడుపాయ‌ల జాత‌ర‌కు ఏర్పాట్లు పూర్తి

Must Read
  • భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు..
  • అధికారుల సమన్వయంతో పనిచేయాలి..
  • ఏడుపాయల జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలో జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌..

నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఏడుపాయల జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. మంగళవారం ఏడుపాయలలోని హరిత హోటల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్‌ జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహిం చారు. మూడు రోజులపాటు జరిగే వేడుకలను అత్యంత వైభవ్వేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాం టి ఇబ్బందులు కలగకుండా, సంబంధిత శాఖలను అధికా రులు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆద ేశించారు. జాతర ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండ కుండా చూడాలని, దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల సంకేదృష్ట ఆర్టీసీ ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపాలని డిపో మేనేజర్లు సమన్వయం చేసుకుం టూ అదనపు సర్వీసులు నడపాలన్నారు. జాతరను పర్యవేక్షించేందుకు అన్ని శాఖల అధికారుల నోడల్‌ ఆఫీసర్ల సమన్వయంతో కంట్రోల్‌ రూమ్‌, హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలన్నారు. జాతరలో ముగ్గురు డిఎస్పీలు, 20 మంది సీఐలు, 60 మంది ఎస్‌ఐ లు సహ మొత్తం 883 మంది పోలీస్‌ సిబ్బంది, 598 మంది పంచాయతీ రాజ్‌ సిబ్బంది, 251 మంది వైద్య సిబ్బంది, 150 మంది గజ ఈతగాళ్లు, ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో 9 సంచార బృందాలు, రెండు చెక్‌ పోస్టులు, ఇతర శాఖల సిబ్బంది జాతర లో విధులు నిర్వహించనున్నారన్నారు. 400 ఆర్టిసి బస్సు లు, దేవస్థానం వరకు పది ఉచిత మినీ బస్సులు, 10 వైద్య శిబిరాలు 4 అంబులెన్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌, ఆర్డీవో రమాదేవి, నర్సాపూర్‌ ఆర్డీవో మహిపాల్‌ రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్‌, ఏడుపాయల ఈవో చంద్రశేఖర్‌, మెదక్‌ సిఐ రాజశేఖర్‌, సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This