గ*జాయిను రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మంగళవారం విజయనగరం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుండి 22 కిలోల గ*జాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి చెందిన ముగ్గురు నిందితులు ధర్మపురి ప్రాంతంలోని వసంత విహార్ విల్లా నుండి ఢిల్లీకి గ*జాయి రవాణా చేస్తున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ ముగ్గురు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ గ*జాయి రవాణా చేస్తున్నారని ఎస్పీ అన్నారు. నిందితుల వద్ద నుండి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించామని తెలిపారు.