Monday, August 18, 2025
spot_img

వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం.

Must Read

వై నాట్ 175 అంటూ మితిమీరిన ఆత్మ విశ్వాసంతో ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది…
సిద్దం! అంటూ విపక్షాలకు సవాల్ చేసిన జగన్.. కళ్ళు తెలేసాడు…
151 సీట్లతో 2019 లో అధికారం చేపట్టిన జగన్ ప్రజారంజక పాలన అందించడంలో పూర్తిగా విఫలమైనట్లు ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి.. లక్షల కోట్లు అప్పులు చేస్తూ అభివృద్ధి ఊసే లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్ ను ప్రజలు పట్టించుకోలేదు.
అభివృద్ధి లేని సంక్షేమ పథకాల వల్ల నష్టమే అని గ్రహించిన ప్రజలు మూకుమ్మడిగా జగన్ ప్రభుత్వాన్ని తిరస్కరించారు.. బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నానంటూ జగన్ చెప్పిన మాటలను ప్రజలు నమ్మలేదు.. మౌలిక వసతులు కల్పించకుండా రాజధాని లేకుండా చేసి రాష్ట్రాన్ని బ్రాష్టుపట్టించాడనే అభిప్రాయాన్ని ఓట్ల రూపంలో ప్రజలు వ్యక్తం చేసారు. ప్రజాపాలన కాకుండా… అక్కరలేని పథకాలతో డబ్బులు ఫ్రీగా పంచడాన్ని ప్రజలు అంగీకరించలేదు.. మూడు రాజధానుల పేరుతో అమరావతి రాజదాని ప్రాంతాన్ని విద్వంసం చేయడం.. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి లేకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి నెలకొనడం..

  • అధికారపార్టీ నేతలు అరాచకాలు
  • శాంతిభద్రతలు చేజారిపోవడం
  • దక్షిణాది బీహార్ గా రాష్ట్రం ముద్రపడిన పరిస్థితులు..
  • భూములు లాక్కోవడం..
  • ప్రతిపక్షాలపై దాడులు
  • రాష్ట్రంలో నిత్యం అలజడి వాతావరణం..
  • రోడ్లు అధ్వాన్నంగా మారడం..
  • కల్తీ మద్యం..
  • ప్రభుత్వ ఉద్యోగుల అవస్థలు.. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోవడం తదితర అనేక అంశాలు జగన్ పై వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయి..
  • ఇక ఎన్నికల ఏడాది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను అకారణంగా అరెస్ట్ చేయడం కూడా ప్రధాన కారణమయ్యింది…
  • మొత్తంగా చూస్తే జగన్ నియంతృత్వ పోకడ లే ఆయన దారుణ ఓటమికి కారణమయ్యాయి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS