ఒక్కసారి తెలంగాణ గుండె శబ్దం చెవులు పెట్టి విను. అమ్మ గుండె శబ్దమే వినబడుతుంది. నల్లరేగడి నేలల్లో మొలిచిన తెల్ల బువ్వ మెతుకును అడిగి చూడు. ఆకలి ఉండదనే భరోసా చూపుతుంది. ఆఫీసుల్లో దర్జాగా ఉద్యోగం, ఊపిరి పీల్చుతున్న ఊపిరిలను తడిమిచూడు. న్యాయబద్ధత ఊపిరిగా నిలుస్తుందని చెప్తుంది. సబ్బండ వర్గాల వృత్తులను ఒక్కసారి పలకరించి చూడు. ఆపదకు ఆదుకునే చేతులు ఉన్నాయని చెబుతుంది. తెలంగాణ అంతా అలుముకుంటున్న అభివృద్ధిని పరిశీలించి చూడు. దీటైన తెలంగాణ నిర్మాణం జరుగుతుందని చెబుతుంది. తెలంగాణ కై అమరులైన త్యాగమూర్తుల గుండె శబ్దాలు దీవెనలై మనలను దీవిస్తూ ఉంటాయి. పొగరు తగ్గకుండా పొలిమేరలో జై తెలంగాణ నినాదాలై కాపు కాస్తుంటాయి.
గుండెల్లి ఇస్తారి, 9849983874